11, జనవరి 2012, బుధవారం
360 గంటల్లో 30 అంతస్తుల మేడ
ఇండిపెండెంట్ ఇల్లు కట్టాలంటే.. కనీసం ఆర్నెళ్లు.. అదే రెండంతస్తుల మేడ కట్టాలంటే ఎంత లేదన్నా ఏడాది. అలాంటిది.. 30 అంతస్తుల మహా మేడ కట్టాలంటే.. మన దగ్గర మినిమం ఐదారేళ్లు పడుతుంది. కానీ, చైనాలో మాత్రం దీనికి పట్టిన సమయం.. కేవలం 360 గంటలు... మరోలా చెప్పాలంటే 15 రోజులు... నిజం.. ఊహకు అందని రీతిలో, రికార్డ్ స్థాయి టైమ్ లో చేసి చూపించారు చైనా చిచ్చరపిడుగులు.
ఇదోదో సరదా కోసం కట్టింది కాదు. పక్కా ప్లానింగ్ తో, పర్ ఫెక్ట్ డిజైన్ తో రూపొందించారు. 9 మాగ్నిట్యూడ్ భూకంపం వచ్చినా, ఈ బిల్డింగ్ చెక్కుచెదరదని ఇంజనీర్లు భరోసా ఇస్తున్నారు. ది ఆర్క్ అనే హోటల్ కోసం దీన్ని నిర్మించారు. ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తున్న ఈ మల్టీస్టోర్‌డ్ బిల్డింగ్‌ను బ్రాడ్ గ్రూప్ అనే సంస్థ నిర్మించింది. హునాన్ ప్రావిన్స్‌లో డాంగ్‌టింగ్ సరస్సు పక్కన ఈ హోటల్ ఉంది. పిల్లర్లు, ఇతరత్రా కాంక్రీట్ షీట్లను ముందుగానే తయారు చేసుకుని వాటిని ఒక్కచోట చేర్చి ఈ రాజభవనాన్ని 360 గంటల్లో కట్టిపడేశారు. చైనా ఇంజనీరింగ్ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పారు.. దీన్ని చూశాకా అయినా.. మనం చైనా ది గ్రేట్ అనక తప్పదు. మీకేమైనా అనుమానం ఉంటే ఈ వీడియోను చూడండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి