29, జనవరి 2012, ఆదివారం
వడ్డీకి ఇచ్చారు... వ్యాపారం చేసుకోమన్నారు..
మద్యం మాఫియాలో చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. మద్యం సిండికేట్లపై, ఎక్సైజ్ అధికారులపై ఏసీబీ పలు దఫాలుగా చేసిన దాడులు.. ఆశ్చర్యకరమైన వివరాలను బయటపెట్టాయి. సిండికేట్లను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులే.. వాళ్లకు అప్పులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఏసీబీ గుర్తించింది. సిండికేట్లపై ఏసీబీ రూపొందించిన 750 పేజీల నివేదికలో పలు కీలక విషయాలున్నాయి.
ఏడు జిల్లాల్లో 22 ప్రాంతాల్లో 33 మద్యం సిండికేట్ కార్యాలయాలపై ఏసీబీ ఇటీవల దాడులు జరిపింది. మద్యం సిండికేట్లకు.. ఏసీబీ అధికారులు అప్పులు ఇస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది.
ఓ జిల్లాలో మద్యం సిండికేట్ నాయకుడికి ఆ ప్రాంత ఎక్సైజ్ సిబ్బంది రెండు కోట్ల 40 లక్షల రుపాయాలను అప్పుగా ఇచ్చారు. ఇందులో కేవలం ఓ హెడ్ కానిస్టెబుల్ వాటానే 53 లక్షలు ఉందంటే.. ఏ రేంజ్‌లో అవినీతి ప్రవాహం సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరో జిల్లాలో ఎక్సైజ్ అధికారుల నుంచి అప్పు తీసుకున్నందుకు ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్‌కు 22 లక్షలు, ఓ సబ్ ఇన్స్‌పెక్టర్ 10 లక్షల వడ్డీని కట్టారని ఆధారాలు దొరికాయి. ఓ జిల్లాకు చెందిన సిండికేట్ నాయకుడు మరో జిల్లాకు చెందిన ఇద్దరు ఇన్స్‌పెక్టర్‌లకు ఏడాది కాలంగా 37 లక్షల వడ్డీని చెల్లించినట్లు కీలక పత్రాలు ఏసీబీ చేతికి చిక్కాయి. ఈ ఆధారాలు చూస్తుంటే ఎక్సైజ్ అధికారులే మద్యం సిండికేట్లలో పెట్టుబడులు పెట్టి చీకటి వ్యాపారాన్ని పెంచి పోషిస్తున్నారని అర్థమవుతోంది. ఇప్పటి వరకూ ఎక్సైజ్ అధికారులు, 11 మంది మద్యం సిండికేట్ల నాయకులతో పాటు మరో 10 మందిని అరెస్టు చేశారు. ఇప్పటికి చిన్న చేపలే ఏసీబీకి చిక్కాయి.. ఇక పెద్ద చేపలు వలలో పడితే.. ఇంకెన్ని సమ్..గతులు బయటకువస్తాయో.. !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఎన్నివందల పేజీలుంది రిపోర్ట్ అన్నది కాదు ప్రశ్న. చర్య తీసుకున్నదేమిటి అన్నది పాయింటు.