9, జనవరి 2012, సోమవారం
బాబు ట్రీట్ మెంటే జగన్ కూ..
తెలంగాణలో పర్యటించే విషయంలో బాబుకిచ్చిన ట్రీట్ మెంట్నే జగన్ కూ ఇవ్వాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. తెలంగాణకు అనుకూల ప్రకటన చేయని జగన్ ను అడ్డుకోవాలంటూ తెలంగాణ వాదులకు జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. అయితే, రైతుల కోసం పోరాడుతున్న తమ నేతను అడ్డుకోవద్దంటూ వైఎస్సార్ సీపీ తెలంగాణ నేతలు విజ్ఞప్తి చేశారు. జగన్ తెలంగాణకు సానుకూలమేనని ఆ పార్టీనేత బాజిరెడ్డి గోవర్ధన్ నిన్న నిజామాబాద్ లో చెప్పారు. జేఏసీ అడ్డుకోమని పిలుపు నిచ్చిన నేపథ్యంలో జనవరి 10న మొదలు కావాల్సిన జగన్ దీక్షపై ఉత్కంఠ నెలకొంది. బాబు లాగానే జగన్ కూడా దీక్షను పూర్తి చేసుకుని వస్తారా.. లేక మానుకోట ఘటనలా మధ్యలోనే వెనుదిరుగుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ ఆర్మూర్ దీక్ష విజయవంతం అయితే, తెలంగాణలో ఆయన పర్యటనలకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయినట్లే. ఉపఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో తన అభ్యర్థులను నిలబెట్టనని ప్రకటించడం ద్వారా, ఇప్పటికే సగం లైన్ క్లియర్ చేసుకున్నారు జగన్. ఆర్మూర్ దీక్షతో మొత్తం రూట్ ను సెట్ చేసుకోవాలనుకుంటున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి