22, డిసెంబర్ 2011, గురువారం
చిరంజీవి మళ్లీ పార్టీ పెడతారా..?
Categories :
chirnajeevi . POLITICS . prp . TOP
మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ నుంచి బయటకు వస్తారా..? మళ్లీ ప్రజారాజ్యాన్ని పునరుద్దరిస్తారా..? ఈ అనుమానాలను సృష్టించే సంకేతాలు విడుదలయ్యాయి. నెల్లూరు జిల్లా పీఆర్పీ శానససభ్యుడు శ్రీధర్ కృష్ణారెడ్డి చేసిన ప్రకటన.. అటు కాంగ్రెస్‌లోనూ, అందులో విలీనమైన పీఆర్పీ నేతల్లోనూ కలకలాన్ని సృష్టించింది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని, ప్రజారాజ్యం పునరుద్దరణ కూడా జరగొచ్చని ఆయన ప్రకటించారు. మంత్రి పదవులపై కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవడం, కేంద్రంలో అజిత్ సింగ్‌ను మాత్రమే తీసుకుని, చిరును వెయిటింగ్ లిస్టులో పెట్టడంతో చిరంజీవి పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అత్యవసర సమయంలో విలీనం చేసినప్పటికీ, తమకు సరైన గౌరవం దక్కడం లేదన్న వేదనతో ఆయన ఉన్నారు. పైగా, అజిత్ సింగ్ గతంలో జనతాపార్టీలోనూ , కాంగ్రెస్‌లోనూ పార్టీని విలీనం చేయడం, మళ్లీ పునరుద్దరించడంతో.. చిరంజీవి కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
తనకి సిగ్గు ఇసుమంతయినా లేదని నిరూపించదలచుకుంటే చిరు ఈ పని చేయవచ్చు.