26, డిసెంబర్ 2011, సోమవారం
సీఎం టార్గెట్ నెంబర్ 2
Categories :
cm . congress . kiran kumar . POLITICS . TOP
రాష్ట్ర ప్రభుత్వంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులకు, సీఎంకు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటం.. అవినీతిని వెలుగులోకి తెస్తోంది. బొత్సను కంట్రోల్ చేయడానికి మద్యం సిండికేట్లపై ఏసీబీని పురిగొల్పిన సీఎం.. నెక్ట్స్ టార్గెట్‌గా, డిప్యూటీ సీఎం రాజనర్సింహను ఎంచుకున్నారు..
త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తుండడంతో, హోంమంత్రి పదవిని దక్కించుకోవడానికి రాజనర్సింహ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డిప్యూటీసీఎంగా ఉన్నవారే, హోంమంత్రిగా ఉండడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి, ఆ పోస్ట్ తనకు ఇవ్వాలని రాజనర్సింహ కోరుతున్నారు. పైగా, సబితపై ఆరోపణలు రావడం, శంక్రరావు-సబిత మధ్య వివాదం రాజనర్సింహకు కలిసొచ్చేలానే ఉన్నాయి. కానీ, హోంమంత్రి పదవిని రాజనర్సింహ చేపడితే, తనకు ఇబ్బందులు తప్పవనుకుంటున్న సీఎం.. ఆయనకు పగ్గం వేయడానికి ప్రణాళిక రచిస్తున్నారు. బొత్స విషయంలో వేసిన ప్లాన్‌నే రాజనర్సింహకు కూడా వర్తింప చేయాలనుకుంటున్నారు.
దామోదర్ రాజనర్సింహ ఉన్నత విద్యాశాఖామంత్రిగా వున్నప్పుడు జరిగిన అవకతవకలను వెలికితీసే పనిలో వున్నారు సీఎం. ఆ సమయంలో ఆయనపై వచ్చిన ఆరోపణల వివరాలను ... అలాగే, యూజీసీ గ్రాంట్స్‌కోసం ఉద్దేశించిన టీక్వీప్ జీవో జారీలో ముడుపులు ముట్టాయంటూ.. ఓ నివేదికను తయారు చేసి సీఎం హైకమాండ్‌కు పంపించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరి సీఎం రిపోర్టులు దామోదర రాజనర్సింహకు హోంమినిస్ట్రీని దూరం చేస్తాయో.. లేదంటే, రాజనర్సింహ పలుకుబడే ఫలించి... పదవి అందుతుందో వేచిచూడాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి