11, నవంబర్ 2011, శుక్రవారం
తాజ్ మహల్ చూడడం ఇక కష్టమే
అమర ప్రేమకు అదో నిర్వచనం. షాజహాన్-ముంతాజ్ బేగంల బంధానికి అదో నిదర్శనం. అదే... ప్రపంచ వింతల్లో ఒకటిగా వినుతికెక్కిన తాజ్‌మహల్. ఎన్నిసార్లు చూసినా, ఎంతసేపు చూసినా తనవితీరదు.. కానీ ఇకపై అలా తాజ్‌మహల్ చూస్తూ మైమరిచిపోతామంటే కుదరదు.. ఎందుకంటే.. తాజ్‌మహల్ పర్యాటకులపై త్వరలోనే కొత్త రూల్స్ కసితీర్చుకోబోతున్నాయి..
తాజ్‌మహల్‌ను చూడాలనుకునేవారికి, చూడడానికి ఆగ్రా వరకూ వెళ్లేవారికి ఓ చేదువార్త. తాజ్‌మహల్‌ను మైమరిచిపోయి చూడడానికి ఒప్పుకోమంటోంది భారత పురావస్తుశాఖ. విపరీతంగా వస్తున్న పర్యాటకులతో, అపురూప కట్టడానికి ప్రమాదం పొంచి ఉందని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ భయపడుతోంది. అందుకే, పర్యాటకులను కంట్రోల్ చేయడానికి ఇకపై షిఫ్ట్ సిస్టంను ప్రవేశ పెట్టాలనుకొంటోంది. కొన్నేళ్లుగా తాజ్‌మహల్ చూడడానికి వచ్చే దేశవిదేశీ పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా, దాని వల్ల, తాజ్‌మహల్‌కు ప్రమాదం అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు.. యమునా నదిలో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోవడం వల్లా.. ఈ ప్రేమమందిరం పునాదులకు సమస్యలు రావచ్చంటున్నారు. యమునలో నీరు తగ్గిపోవడం, భారీగా పర్యాటకులు రావడం వల్ల.. తాజ్‌మహల్ కూలిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. అందుకే, తాజ్‌మహల్‌ను రక్షించడం కోసమే.. షిఫ్ట్ పద్దతికి జై కొడుతున్నారు. అధికారుల నిర్ణయం పట్ల పర్యాటకులు మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్త చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కాసేపట్లోనే పంపేయాలనుకోవడం సరికాదంటున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి