18, అక్టోబర్ 2011, మంగళవారం
సిగ్గు సిగ్గు.. ఇదేనా మానవత్వం..!
చైనాలో దారుణం చోటు చేసుకుంది. మోడ్రన్ సొసైటీలో మానవత్వం ఎలా మంట గలిసిపోతోందో మరోసారి స్పష్టమయ్యింది. చైనాలోని ఫోషన్ నగరంలో చావుబతుకుల మధ్య ఓ రెండేళ్ల చిన్నారి కొట్టుమిట్టాడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆ పసిపాప పక్కనుంచే వెళ్తూ కూడా స్పందించలేదు. ఓ రోడ్డులో చిన్నారి వాంగ్ యూ నడుస్తుండగా.. ఓ కారు ఢీ కొట్టింది. ముందు టైర్లు పాపపైనుంచి వెళ్లిపోయాయి. కారును ఆపినట్లే ఆపి.. మళ్లీ పోనిచ్చాడు. దీంతో వెనుక టైర్ల కింద ఆ అమ్మాయి నలిగిపోయింది. వెంటనే ఆ వీధిలోనుంచి చాలామంది నడుచు కుంటూ.. సైకిళ్లపైనా, మోపెడ్లపైనా వచ్చినా.. చూడనట్లే వెళ్లిపోయారే తప్ప.. వాంగ్ యూను రక్షించడానికి ప్రయత్నించలేదు. ఇంతలో వచ్చిన మరో వ్యాన్ కూడా ఆ అమ్మాయి పై నుంచే వెళ్లింది. ఆ తర్వాత వచ్చిన ఓ మహిళ.. ఆ పసిపాపను పక్కకు లాగింది. ప్రస్తుతం ఆస్పత్రికి తరిలించినప్పటికీ పరిస్థితి విషమంగా ఉంది. వాంగ్యూ బ్రెయిన్‌డెడ్ అయినట్లు చైనా అధికారిక పత్రిక ప్రకటించింది. ఏ క్షణమైనా ఆ అమ్మాయి చనిపోవచ్చని పేర్కొంది. చిన్నారిని ఢీకొట్టిన ఇద్దరు డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానికులపై చైనా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సతీష్ గారు మనుష్యుల కంటే రాక్షసులు నయమేమో గుండెను పిండేసె సంఘటన. ఇది సున్నిత మనస్కులు చూడలేరు దయచేసి ఈ పోస్ట్‌ను మీకు అభ్యంతరం లేకపోతే తొలగించండి.