15, ఆగస్టు 2011, సోమవారం
దేశం గురించి మీకు ఏం తెలుసు?
మన దేశం గురించి, మన దేశ ఔన్నత్యం గురించి తెలుసుకోవాల్సిన సమయమిది.
ప్రపంచ భూవైశాల్యంలోమన దేశ వాటా 2.3 శాతం. ప్రపంచ జనాభాలో మనది ఆరోవంతు వాటా.
ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం ప్రపంచ పేదల్లో 36 శాతం మంది మనదేశంలోనే ఉన్నారు.
భారత జనాభాలో 64 శాతం మంది 15 నుంచి 64 ఏళ్ల మధ్య వారే.
మన దేశంలో ప్రతీ చదరపు కిలోమీటరుకు సగటున 361 మంది జీవిస్తున్నారు.
ప్రతీ వంద మంది స్త్రీలకు సగటున 106.8 మంది మగాళ్లున్నారు.
కార్బన్ డై యాక్సైడ్ ఉత్పత్తిలో మనది ప్రపంచంలోనే నాలుగోస్థానం (2008 లెక్కల ప్రకారం)
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మనది పదోస్థానం
ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ మనదేశానికి సొంతం. దేశంలో మొత్తం లక్షా యాభై వేల పైచిలుకు పోస్టాఫీసులున్నాయి.
ప్రపంచంలో అతి ఎక్కువమంది ఉద్యోగులున్నది భారతీయ రైల్వేలోనే.
రహదారుల పరంగా ప్రపంచంలో మూడో స్థానం భారతదేశానిది.
ప్రపంచంలో 25 శాతం మంది భారతదేశంలో పుట్టిన మతాలనే అనుసరిస్తారు. అవి హిందూ,బౌద్ధం,సిక్కు,జైన్
17వ శతాబ్ధం వరకూ అంటే, బ్రిటీష్ దురాక్రమణకు ముందు వరకూ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం మనది.
ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఇంగ్లీష్ మాట్లాడేవారున్నది భారతదేశంలోనే.
ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం నెలకొల్పింది మనదేశంలోనే. తక్షశిలలో క్రీస్తు పూర్వం 700 వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు.
దాదాపు 10 వేలకు పైగా భారతదేశ చరిత్రలో మరో దేశాన్ని దురాక్రమించింది లేదు.
ప్రపంచంలోనే మనుషులు ఇప్పటికీ జీవిస్తున్న అత్యంత పురాతనమైన నగరం వారణాసి (కాశి).
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నా భారత సోదరా సోదరిమనులరా! ఇప్పుడు ఎన్నికలల్లో డబ్బులతో జరుగు తున్నాయి.ఇలా మనం డబ్బు కు మద్యపానం కొరకు ఓట్లు వేస్తే, నాయకులు ఒక్కసారి మానని 5 సం// ఒక్కసారి కొను చున్నారు, ఆదే 5 సం// లల్లో,అవకాశం వున్నా ప్రతిసారి ఆమ్ముచున్నారు,దయచేసి ఆమ్ముడు ఫోవద్దు,మనమల్ని ఆమ్మనియవద్దు,నీతి గెలించండి మీరు గెలవండి.పనిచేసేవారికి గెలిపించండి,రాజకీయము పదవి వారసత్వం కాదు అన్ని నిరుపించండి,అధికారం వున్నంతమాత్రాన/డబ్బు/ఖండ బల్లము / భయము తో,భారతీయులను కొన్నగల వారు ఎవరు, ఇంతకీ పుట్యారా? అంటే ఇప్పుడు మన సమాధానము ఏంటి?ఆవును అంటే కాదు అన్నలేము, ఇది సత్యం, ఆయినా ...నాకు నా పై మరియు నా భారత సోదరులా పైనా నమ్మకం వుంది, ఒకరు పోరాటం నీతి నిజాయతి తో మొదలు పెట్టితే అందరు కలసి పోరాడుతారు, అందుకు నేన్ను బీజం ఎందుకు కాకూడదు,అన్ని మొదలు పెట్టగా నాతొ నామిత్రులు బీహార్ కు చెందినా "కుమోడ్ ఝా" నాతో కలసి మరియు కొంత మంది కలుపుకొన్ని కొత్త జాతీయ రాజకీయ పార్టీ స్తాపిస్తున్నాం! రండి కలసి రండి..నిరుపిద్ధాం!ఈణ్షాఆల్లహ్ : నూరబ్డుల్ ర్రహామన్ ఖాన్,S /O :నన్నే ఇమామ్ ఖాన్, D.NO:20-8-A,పాతూర్ , పెద్దమండ్యం,చిత్తూరు(జిల్లా),ఆంద్ర ప్రదేశ్, భారత దేశము.