16, ఆగస్టు 2011, మంగళవారం
వేడెక్కిన ఢిల్లీ
Categories :
anna hazare . news . TOP
అన్నాహజారే నేడు దీక్ష చేస్తారా...?
ఒకవేళ చేస్తే... ఎక్కడ చేస్తారు...?
జేపీ పార్క్‌లో దీక్ష సాధ్యమేనా...?
యావత్ దేశ ప్రజల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి... ఎందుకంటే.. ఢిల్లీ పోలీసులను జేపీ పార్క్‌లో అన్నాహజారే దీక్షకు అనుమతి నిరాకరించారు. తాము పెట్టిన 22 షరతులన్నింటికీ ఒప్పుకోనందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని పోలీసులు ప్రకటించారు. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేసిన తర్వాత ప్రధానమంత్రి తన ప్రసంగంలో... అన్నాహజారే దీక్షను ప్రస్తావించారు. బలమైన లోక్‌పాల్ బిల్లు తెనున్నట్లు హామీ ఇచ్చారు. ఏవైన అభ్యంతరాలుంటే... చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కాని దీక్షలతో కాదన్నారు. ప్రధానమంత్రి ప్రకటనతో హస్తినలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.. అన్నాహజారే దీక్షకు అనుమతి ఇవ్వడం లేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.. జేపీ పార్క్ వద్ద పెద్దఎత్తున బలగాలను మోహరించడమే కాకుండా... 144 సెక్షన్ విధించారు.. నిబంధనలను ఉల్లంఘించి పార్క్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే.. అన్నాహజారేతోసహా ఎవరినైన అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
ఢిల్లీ పోలీసుల ప్రకటన తర్వాత అన్నాహజారే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంక్షలు విధించినప్పటికీ.. జేపీ పార్క్‌లో దీక్ష చేపడతానని ఆయన స్పష్టం చేశారు. పార్క్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే అక్కడే దీక్షకు కూర్చుంటానని అన్నా తెలిపారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తే... ప్రజలు కూడా స్వచ్ఛందంగా జైలు భరో కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్నాహజారే దీక్షలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి జేపీ పార్క్ వద్దకు తరలివచ్చిన వందలాది మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి పోలీసుల ఆంక్షలు... అన్నా హజారే పంతంతో హస్తినలో ఉద్రిక్తత నెలకొంది..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి