14, ఆగస్టు 2011, ఆదివారం
ఏ మొహం పెట్టుకున్నారు..?
Categories :
anna hazare . congress . POLITICS . TOP
అవును, ఏ మొహం పెట్టుకున్నారు..? మీదే మొహమంటే.. మీదే మొహం. ఆ మోహం పెట్టుకుని ఎలా చేస్తారు..? ఈ మొహం గొడవేమిటనిపిస్తోంది కదూ.. ఇదంతా అవినీతిపై పోరాటం చేస్తున్న అన్నాహజారేకు, ఆయన డిమాండ్లకు ఒప్పుకోని కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ కు మధ్య సాగుతున్న మాటల యుద్ధమిది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, తన దీక్షకు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ ప్రధానికి శనివారం ఘాటైన లేఖ రాశారు అన్నా హజారే. ప్రధాని మౌనంగా ఉండడాన్ని కడిగిపారేస్తూ.. ఏ మొహంతో జెండావందనం గావిస్తారంటూ సూటిగా ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్ నుంచి కౌంటర్ వచ్చింది. అన్నా హజారే అవినీతి పరుడంటూ ఏఐసీసీ కార్యదర్శి మనీష్ తివారి విరుచుకుపడ్డారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థల్లో నాలుగైదువాటిల్లో అవినీతిని హైకోర్టు నియమించిన విచారణ కమిటీ బయటపెట్టిందన్నారు. అవినీతిలో కూరుకున్న అన్నాహజారే ఏ మొహం పెట్టుకుని అవినీతిపై పోరాడుతున్నారంటూ ప్రశ్నించారు. అంతేకాదు, ప్రధానిని విమర్శించడం .. జాతీయపతాకాన్నే విమర్శించినట్లన్నారు. మొత్తానికి మొహాల గొడవ రెండు వర్గాల మధ్యా అలా సాగుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి