తెలుగు బ్లాగర్లకు, బ్లాగ్ పాఠకులకు, 24గంటలను ఆదరిస్తున్న నెటిజన్లకు నమస్కారం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన కీలక సమయంలో నేను నా బ్లాగ్ను అప్డేట్ చేయలేకపోయాను. నిత్యం నా బ్లాగ్ చూసే వారికి ఈ విషయంలో అనుమానం కూడా వచ్చి ఉండొచ్చు. నాకు పాప పుట్టడంతో కంప్యూటర్లకు దాదాపు వారం రోజుల పాటు దూరం కావాల్సి వచ్చింది. అదే సమయంలో నివేదిక వచ్చినా, స్పందించే వీలు నాకు లేకపోయింది. ఈ లోగా చాలామంది తమ బ్లాగ్లను అప్డేట్ చేశారు. అందుకే, నేను మళ్లీ ఆ వివరాలను నా బ్లాగ్లో పెట్టలేదు.
తండ్రినయ్యానన్న ఫీలింగ్ ఎంతో బాగుంది. అందమైన అమ్మాయిని నా భార్య నాకు బహుమతిగా అందించింది. కొత్త ఏడాదిలో కొత్త జీవితం మొదలయ్యింది. ఇకపై మళ్లీ క్రమం తప్పకుండా పోస్టులను, నా తరహా రాజకీయ విశ్లేషణలను, వార్తలను మీకు అందిస్తాను.
ధన్యవాదాలు
సతీష్ దేవళ్ల
11, జనవరి 2011, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పుత్తడి బొమ్మ కు తండ్రి అయినందుకు శుభాకాంక్షలు
Congratulations
Congratulations and welcome to the little'princess'.
Dear Satish!
వెల్కం టూ థ వాల్డ్ ఆఫ్ "ఆడపిల్ల ఫాదర్స్"!
ఎందుకంటే నాకు ఆడపిల్ల అంటే ఎంత ఇష్టం అంటే మనలాంటి (కాస్త స్థితి/ జ్ఞానమంతులందరికీ) వారందరికీ ఆడపిల్లలే పుట్టాలనే వింత కోరిక నాది.
లాజిక్ ఏమిటంటే అలా కాకుండా పాపం కాస్త పేదరికంలో ఉండే ఇంట్లో ఆడపిల్ల పుడితే ఎన్నో కష్టాలెదుర్కోవలసి వస్తుంది:
మరిన్ని వివరాలకు నా పోస్ట్ "ఆడపిల్ల దేశానికి గర్వకారణం"చూడండి@http://dare2questionnow.blogspot.com/2010/11/blog-post_24.html
Congrats satish.....