13, జనవరి 2011, గురువారం
మోడీ మ్యాజిక్
కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలికి అతను మృత్యుబేహారి కావచ్చు. ఒక్క మతాన్ని కాపాడడమే లౌకికవాదమనుకేవారికి అతను హిందూ అతివాది కావచ్చు. అమెరికా తన దేశంలోకి అతన్ని అడుగుపెట్టనివ్వకపోవచ్చు. కానీ, గుజరాత్‌కు మాత్రం అతనో వెలుగుదివ్వె. పారిశ్రామిక వేత్తలకు కావాల్సిన మహానేత. అందుకే.. గుజరాత్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. మరి మనమో...? చెప్పాలంటే.. గుజరాత్ ఘనం...అనిశ్చితిలో మనం. ఏంటీ కొటేషన్ అంటారా..? రాజకీయ అనిశ్చితి మనకు శాపంలా మారితే వైబ్రాంట్ గుజరాత్ పేరిట మోడీ సర్కార్ లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇన్వెస్టర్ల మీట్‌లో తొలిరోజే గుజరాత్ 15 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టుకుంది. రెండేళ్ల కిందటే ఇదే తరహాలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహించాలనుకున్న మన ప్రయత్నాలు మాత్రం ముందుకు కదలడం లేదు.
అంబానీల నుంచి ఆదానీల వరకూ...ఎస్సార్ నుంచి ఎల్‌అండ్‌టి వరకూ కురిపిస్తున్న లక్షల కోట్ల పెట్టుబడులను చూస్తే అవుననిపించక మానదు. రెండేళ్లకోసారి జరిగే వైబ్రాంట్ గుజరాత్ సదస్సులో బుధవారం తొలిరోజే 15 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ 50వేల కోట్ల పెట్టుబడులు ప్రకటిస్తే...ఆదానీ గ్రూప్ గుజరాత్ 80వేల కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఇక ఎస్సార్ గ్రూప్ 30వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొంది. ఇంకా వేలాది పెట్టుబడి ఒప్పందాలు జరిగినట్లు గుజరాత్ సర్కార్ చెబుతోంది. ముఖ్యంగా విద్యుత్, పోర్ట్, మౌలిక రంగాల్లో పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడ్డాయి. మరి కరుడుగట్టిన హిందుత్వానికి ప్రతీకగా పేరొందిన మోడీ ఇన్వెస్టర్లను ఎలా ఆకట్టుకుంటున్నాడు. అపార వనరులున్న మన రాష్ర్టం సహా ఇతర రాష్ర్టాలకన్నా గుజరాత్‌లో ఉన్న ప్రత్యేకతలేంటి. ఏమైనా పరిస్ధితులకు దీటుగా వేగంగా స్పందించడమే గుజరాత్‌కున్న గుణం అంటున్నారు నిపుణులు. వార్షిక ప్రాతిపదికన మనం ఏటా 50వేల కోట్ల పెట్టుబడులను ఆకట్టుకోవడానికి పాట్లు పడుతుంటే గుజరాత్ సర్కార్ ఒక్కరోజులోనే లక్షల కోట్లను అందిపుచ్చుకుంది. గుజరాత్‌కు వెల్లువెత్తుతున్న నిధులే నరేంద్రమోడీ మార్క్ మేజిక్‌ను చాటుతున్నాయి. ఏమైనా ఏడాది ఆరంభంలో లక్షల కోట్ల పెట్టుబడులతో గుజరాత్ గ్రాండ్ ఓపెనింగ్ చేస్తే...మన దగ్గర మాత్రం రాజకీయ అనిశ్చితికి తెరపడకపోవడంతో ఉద్యమ సెగలు ఊపేస్తున్నాయి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Thatz Power of Modiji, Now He wants and requested to propagate those investemetns to other states also. Truely welcome!
$ఒక్క మతాన్ని కాపాడడమే లౌకికవాదమనుకేవారికి అతను హిందూ అతివాది కావచ్చు
Well said sir!
పరిస్ధితులకు దీటుగా వేగంగా స్పందించడమేకాదు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపాలన్న ధృఢ సంకల్పం,అవినీతి లేకపోవడం,సమర్థ నాయకత్వ లక్షణం వల్లనే సాధ్యమయింది.