3, జనవరి 2011, సోమవారం
మద్దెలచెర్వు సూరి హత్య
పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు సూరి అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను హత్య చేశారు. సోమవారం సాయంత్రం 5.30 నిమిషాలకు అతి దగ్గర నుంచి కాల్పులు జరిపిన దుండగులు ఆయన ప్రాణాలను బలితీసుకున్నారు. కాల్పులు జరిగిన వెంటనే సూరి కోమాలోకి వెళ్లిపోయారు. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. సూరిపై కాల్పులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఆయన సొంత జిల్లా అనంతపురంలో ఆందోళనలు కలిగిస్తున్నాయి... అసలు దాడి ఎలా జరిగిందంటే..
మాదాపూర్‌లోని అలేఖ్య అపార్ట్మెంట్లో కొంతకాలంగా ఉంటున్న సూరి, ఇవాళ మధ్యాహ్నం ఓ లాయర్‌ను కలవడానికి బయటకు వచ్చారు. లాయర్‌తో మాట్లాడి తిరిగి వచ్చేటప్పుడు ఆయనతో పాటు కారులో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకరు డ్రైవర్ మధు కాగా.. మరో వ్యక్తి భాను అని పోలీసులు అనుమానిస్తున్నారు. యూసఫ్‌గూడ లోని నవోదయకాలనీకి చేరుకున్న సమయంలో ఆయనపై ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. కారులోనే కాల్పులు జరిగాయని డ్రైవర్ పోలీసులకు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే.. వెనుక సీట్లో ఉన్న భానే.. సూరిని కాల్చి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పాయింట్ బ్లాక్ రేంజ్లో జరిగిన కాల్పుల్లో ఐదు తూటాలు సూరి శరీరంలోకి దూసుకువెళ్లాయి. చెవి వెనుక నుంచి తలలోకి, ఛాతిలోకి బుల్లెట్లు వెళ్లాయి. సూరిని నమ్మించి భానునే ఈ హత్య చేసినట్లు సమాచారం. అయితే.. ఈ భాను ఎవరు..? సూరి హత్యకు ఎందుకు ఒడిగట్టాడు..? భాను కాక మరెవరైనా ఆ కాల్పులు జరిపారా..? సూరి ప్రధాన శత్రువులైన పరిటాల రవి కుటుంబం, పోతుల సురేశ్, చమన్ల పాత్ర ఉందా అన్నది ఇంకా తేలలేదు. ప్రధాన సాక్షి అయిన డ్రైవర్ చెప్పే విషయాలే అసలు దోషి ఎవరన్నది తేల్చనుంది. మొత్తంమీద సూరి హత్యతో.. పరిటాల రవి, మద్దెల చెర్వు సూరిల మరణంతో అనంతపురంలోని ఓ రక్తచరిత్ర ముగిసిపోయింది.
అయితే.. కారులో ఉన్న వ్యక్తి సూరిని కాల్చినప్పుడు, సాక్షిగా ఉండే డ్రైవర్‌ను ఎందుకు ప్రాణాలతో వదిలేశాడన్నదే అనుమానం. నిజంగానే కారులోంచే జరిగాయా? లేక.. కారు డ్రైవర్ అబద్ధం చెబుతున్నాడా..? ఇదీ తేలాల్సిఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
johar paritala.....
JOHAR NTR ,JOHAR PARITALA.