21, మే 2009, గురువారం
బోల్తాపడ్డ బాబు
Categories :
ఉచిత బియ్యం . చంద్రబాబు . నగదు బదిలీ . మహాకూటమి . వైఎస్
ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబు బోల్తా పడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మహాకూటమి ఎన్నికల్లో పేరుకుతగ్గట్లుగా మహా ఫలితాన్ని అందివ్వలేకపోయింది. కూటమిలోని పార్టీల మధ్య కీచులాటలు చంద్రబాబు కొంపముంచాయి. నగదు బదిలీ, కలర్‌టీవీల పంపిణీ, ఎన్టీఆర్ ఆరోగ్య పథకం, ఉచిత బియ్యం ఇలా ఎన్నో హామీలు గుప్పించినప్పటికీ... వైఎస్ ఛర్మిష్మా ముందు అవేమీ పారలేదు. అలాగని చంద్రబాబు ఇమేజ్‌ను తక్కువని చెప్పలేం. గత ఎన్నికలతో పోల్చితే.. గణనీయంగా ఓట్లను తెలుగుదేశం సాధించుకోగలిగింది. దాదాపు ౩౦ నుంచి 40 సీట్లలో కేవలం రెండు వేల లోపు ఓట్ల తేడాతో ఓడిపోవడాన్ని బట్టి గట్టిపోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. కానీ ఎక్కువ ఓట్లు రాబట్టుకున్నవాడే విజేతకాబట్టి.. ఈ విషయంలో కాంగ్రెస్సే గెలిచిందని చెప్పాలి. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌కు, వామపక్షాలకు కేటాయించిన సీట్లలో ఎక్కువ గెలవలేకపోవడం.. కూటమి పరాజయానికి మూలకారణం. రెండోది వైఎస్‌ను విశ్వసిస్తున్నట్లుగా టీడీపీని విశ్వసించే పరిస్థితిలో ప్రజలు ఉన్నట్లు కనిపించడం లేదు. బహుశా.. అప్పటిదాకా తిట్టించుకున్న కేసీఆర్‌తో కలవడమూ ఇందుకు కారణం కావచ్చు. సొంతవిధానాల పైనా.. ప్రచారంపైనా పెద్దగా నమ్మకం పెట్టుకోని చంద్రబాబు.. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ వీరిద్దరూ పర్యటించిన ప్రాంతాల్లో వచ్చిన ఫలితాలు పార్టీని నివ్వెరపోయేలా చేశాయి. ఎన్నికలు వస్తున్నాయని తెలిసినా ముందునుంచి సరైన కసరత్తు చేయకపోవడం.. అన్ని ప్రణాళికబద్దంగా చేస్తారని పేరున్న చంద్రబాబే.. చివరినిమిషందాకా పొత్తులు తేల్చకపోవడంతో అనూహ్య ఫలితాలు ఎదరుయ్యాయి. ఇక మళ్లీ అధికారం కావాలంటే.. మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోక తప్పనిసరి పరిస్థితిని తెచ్చిపెట్టాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
good analysis.