21, మే 2009, గురువారం
చీలనున్న టీఆర్‌ఎస్?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా పుట్టుకొచ్చిన తెలంగాణ రాష్ట్రసమితి చీలికదిశ పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ వైఖరిపై నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎప్పటినుంచో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ అసమ్మతి తాజా అసెంబ్లీ ఫలితాలతో బయటపడింది. దాదాపు తొమ్మిదేళ్ల ప్రస్థానంలో తెలంగాణ కోసం కేసీఆర్ ఎప్పుడూ పోరాడింది లేదని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ వైఖరితో విసిగిపోయిన కొంతమంది రెండుమూడు రోజులుగా తీవ్రస్థాయిలో మంతనాలు జరపుతున్నారు. కొత్తగా పార్టీ పెట్టాలని దానికి తెలంగాణ విమోచన ఉద్యమపార్టీగా నామకరణం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ ఈ పరిణామాలతో తీవ్రంగా కలత చెందుతున్నారు. ఉద్యమపార్టీగా పుట్టిన టీఆర్‌ఎస్ తెలంగాణ కళాకారులు, మేధావుల నుంచి అనూహ్య మద్దతు లభించింది. తొలిసారి పోటీ చే్సిన ఎన్నికల్లో ఉచితంగా వీరంతా పార్టీ కోసం పనిచేసి చాలా చోట్ల గెలిపించారు. ఆ తర్వాత కేసీఆర్ రాజకీయంగా పార్టీని వాడుకోవడం చూసి చాలామంది దూరమయ్యారు కూడా. ఈసారి కొడుకును రాజకీయాల్లోకి దింపడంతో.. ఈ అసమ్మతి మరింత ఎక్కువయ్యింది. టిఆర్‌ఎస్‌ను కేసీఆర్ చేతిలోనే ఉంచితే.. స్వార్థప్రయోజనాలకోసమే వాడుకొంటారన్న భావనతో.. పార్టీలోని కొందరు చీలిపోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే.. టీఆర్‌ఎస్ మినహా ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటైన పార్టీలేవీ నిలదొక్కుకోలేకపోయాయి. నరేంద్ర,దేవేందర్‌గౌడ్ పార్టీలే ఇందుకు ఉదాహరణ. మరి ఈ కొత్తమంతనాలు ఏ పరిస్థితికి దారితీస్తాయో..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి