కలరా మహమ్మారి మరోసారి కోరలు చాచింది. హైదరాబాద్లో చాలా కాలం తర్వాత మళ్లీ కలరా ఛాయలకు కనిపిస్తున్నాయి. ఫీవర్ హాస్పిటల్లోచేరిన వారిలో దాదాపు 40 మందికి కలరా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా భోలక్పూర్ వాసులు కావడం గమనార్హం. జలమండలి సరఫరా చేసిన కలుషిత జలాలు తాగి వీరంతా ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కలరాకు చికిత్స ఉన్నప్పటికీ.. తొలి దశలో గుర్తించి మందులు వాడితేనే ఉపయోగం ఉంటుంది. ఇప్పటికే నగరంలో చాలాచోట్ల కలుషిత మంచినీరు సరఫరా అవుతుండడంతో.. ఇది మరిన్ని చోట్లకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది..
కలరా అంటే...
కలరా (Cholera) అనేది అతిసార వ్యాధి. ఈ వ్యాధి విబ్రియో కలరే అను బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది నీరు ద్వారా లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రాణాంతక వ్యాధి. ఆతి విరోచనాలతో మొదలయ్యే ఈ వ్యాధి సోకిన వెంటనే వైద్య సహాయం అందకపోతే రోగి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
9, మే 2009, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
mana raajakeeya nayakulu brathiki vunnaaraa.......? anipistundhi