5, మే 2009, మంగళవారం
విషం చిమ్మిన నీళ్లు
సికింద్రాబాద్‌లోని భోలక్‌పూర్‌లో డయేరియా ప్రబలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. దాదాపు మూడువందల మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నగరంలోని దాదాపు ఐదారు ఆసుపత్రుల్లో వీరంతా చికిత్సపొందుతున్నారు. ఇంతమంది ఒక్కసారిగా డయారియా బారిన పడడానికి కారణం.. జలమండలి అధికారుల నిర్వాహం. మంచినీటి సరఫరాలో అలసత్వం ప్రదర్శించడంతో.. కలుషిత నీరు సరఫరా అయ్యింది. ప్రాణాలు పోవడంతో.. స్థానికులు తీవ్ర ఆందోళన చేశారు. దుకాణాలు మూయించి.. ధర్నా చేశారు. జలమండలి అధికారులతో.. పోలీసులతో గొడవకు దిగారు. ఎంపీ అంజన్‌కుమార్ కారు అద్దాలను పగలగొట్టారు. కొన్నిరోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుందంటూ ఫిర్యాదులు చేసినప్పటికీ.. ఏ ఒక్కరూ పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటిసరఫరా అయ్యే పైపులైన్లలోకి డ్రైనేజీ వాటర్ చేరుతున్నా.. ఇంతవరకూ మరమ్మతులు చేయలేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి