5, మే 2009, మంగళవారం
కొంపముంచింది భారతే: ప్రచండ
నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ (ప్రచండ) సోమవారం తన బాధ్యతలకు రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేపాల్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. అంతేకాకుండా రాజీనామా సందర్భంగా భారత్‌పై పరోక్షంగా ప్రచండ నిప్పులు చెరిగారు.ఆర్మీ చీఫ్‌కు భారత్ మద్దతు ఇస్తుందనే అనుమానంతో ఆయన కఠిన వ్యాఖ్యలు చేశారు. నేపాల్ ఆర్మీ చీఫ్‌ను తొలగించేందుకు మావోయిస్టుల నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ అధ్యక్షుడు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.ఆర్మీ చీఫ్‌ను తొలగించేందుకు విఫలయత్నం చేసిన ప్రచండ ప్రభుత్వం అనంతరం సీపీఎన్ (యూఎంఎల్) మద్దతు ఉపసంహరించడంతో రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ప్రచండ రాజీనామా చేయడంతో ఈ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది.54 ఏళ్ల ఈ మావోయిస్టు నేత సోమవారం జాతీనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని బాధ్యతలకు తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముందురోజు ఆర్మీ చీఫ్ జనరల్ రుక్మాంగాడ్ కతావల్‌ను తొలగించేందుకు నేపాల్ అధ్యక్షుడు రాంబరణ్ యాదవ్ నిరాకరించిన సంగతి తెలిసిందే.విదేశీ, పాత వ్యవస్థను కాపాడుకోవాలనే శక్తులకు తలొగ్గి పనిచేయడం కంటే ప్రభుత్వం నుంచి తప్పుకోవడం ఉత్తమమని ప్రచండ పేర్కొన్నారు. పొరుగుదేశాలతో సత్సంబంధాలు కలిగివుండేందుకు తమ పార్టీ ఇప్పటికీ సిద్ధంగా ఉందని, అయితే తమ వ్యవహారాల్లో జోక్యాన్ని అంగీకరించలేమని స్పష్టం చేశారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి