2, డిసెంబర్ 2011, శుక్రవారం
అమెరికాపై పాక్ యుద్ధం..?
ఇటీవల నాటో దళాలు జరిపిన దాడులతో, ఆగ్రహంతో ఉన్న పాకిస్తాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకొంది. నాటో దళాలు దాడులు జరిపితే.. తిరగబడాలని, వారితో యుద్ధం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ కియానీ ఆదేశాలు జారీ చేశారు. ఈ తరహా దాడులకు ఏ స్థాయి నుంచీ క్లియరెన్స్ అవసరం లేదని, వెంటనే తిరగబడాలని సైనికులను ఉద్దేశించి ప్రకటించాయి. ఆప్ఘనిస్తాన్ కేంద్రంగా తాలిబన్లను ఎదుర్కొంటున్న నాటో దళాలు, చాలాకాలంగా ఆప్ఘన్-పాక్ సరిహద్దుల్లో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇంతకాలం పాకిస్తాన్ ఈ విషయంలో మౌనంగానే ఉన్నప్పటికీ, తాజాగా నాటో దాడిలో 24 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోవడంతో, మనసు మార్చుకుంది. చూస్తూ ఊరుకుంటే, దేశంపైనే అమెరికా దాడికి సిద్ధమవుతుందనుకుంటున్న పాక్.. దానికి తగిన రీతిలోనే జవాబు చెప్పాలనుకొంటోంది. పాక్ సైనికులపై దాడికి అమెరికా క్షమాపణ చెప్పననడంతో, ఎదురుదాడికి సిద్ధమయ్యింది పాకిస్తాన్. మరి, నాటో దళాలు వెనక్కి తగ్గుతాయా.. లేదంటే, పాకిస్తాన్ ను కూడా మరో ఆప్ఘనిస్తాన్ గా మార్చేస్తాయా..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి