2, నవంబర్ 2011, బుధవారం
రాంచరణ్ పళ్లు రాలిపోతాయన్న బాలయ్య?
Categories :
balakrishna . entertainment . ramcharan . tollywood . TOP
ఓ కుర్ర హీరోపై నందమూరి నటసింహం బాలకృష్ణ నిప్పులు కురిపించారు. ముందూ వెనకా చూడకుండా విమర్శించారు. ఇటీవలే శ్రీరామరాజ్యం ఆడియో సక్సెస్ మీట్ హైదరాబాద్లో జరిగింది. అందులో ప్రసంగం మొదలుపెట్టిన బాలయ్య.. ఒక్కసారిగా విమర్శలకు దిగారు. " ఓ హీరో ఈ మధ్య ఓ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ.. అలాంటి వ్యక్తి తెలుగులో పుట్టకపోవడం దురదృష్ణకరమన్నాడు. వాడికి అప్పుడే ఫోన్ చేసి చెప్పా.. పళ్లు రాలిపోతాయని. వాడికేం తెలుసు. విత్తు నేరుగా వృక్షమైపోయింది.. అదే విత్తు మొక్కై, వృక్షంగా మారితే వాడికి అన్ని సంగతులూ తెలిసేవి. ఏ తెలుగులో గొప్ప డైరెక్టర్లు లేరా.? ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి అద్భుతమైన సినిమాలు తీయలేదా..?" అంటూ ఆవేశభరితంగా ప్రసంగించారు. బాలకృష్ణ విమర్శించింది చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నే అని ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. దీనిపై తిరుపతిలో ఉన్న చిరంజీవిని మీడియా ప్రశ్నించింది. బాలకృష్ణ లాంటి సీనియర్ నటుడు అన్నాడంటే ఆ మాటల్లో ఏదో ఓ అర్థం ఉంటుందని చిరంజీవి చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, తాను బాలకృష్ణ ప్రసంగాన్ని వినలేదంటూ, ఆ గొడవను అంతటితో ముగించారు చిరంజీవి.
రామ్ చరణ్ ఏమన్నాడు..?
బాలయ్య ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా, సెవెన్త్ సెన్స్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలపైనే స్పందించాడన్నది అందరి అనుమానం. సెవెన్త్ సెన్స్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతూ సూర్యను, మురుగన్ దాస్ ను పొగిడారు. మురుగన్ దాస్ గొప్ప డైరెక్టర్ అని, తనతో ఓ సినిమా చేయాలని కోరారు. ఇక సూర్య నటన చూసి సౌత్ ఇండియా అంతా సిగ్గుపడుతోందన్నారు. అయితే.. అలాంటి డైరెక్టర్ తెలుగులో పుట్టకపోవడం దురదృష్ణకరమని అన్నట్లుగా వీడియో ఫూటేజ్ లో లేదు. ఒక వేళ ఆఫ్ ది రికార్డ్ అన్నారా లేదా అన్నదీ పూర్తిగా తెలియదు. కాకపోతే, మన దురదృష్టమేమోగానీ, గత జనరేషన్లో ఒక్కడే కమల్ హాసన్ ఉన్నాడని, ఈ జనరేషన్లో ఒక్కడే సూర్య ఉన్నాడని, సూర్యలానే అందరూ తయారవ్వాలని రాంచరణ్ అన్నాడు. ఈ నేపథ్యంలో బాలయ్య ఎవరిని టార్గెట్ చేసుకుని ప్రసంగం చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి