30, అక్టోబర్ 2011, ఆదివారం
హంటర్ వైరస్
డెంగ్యూ జ్వరాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాన్ని.. మరో డేంజర్ వైరస్ టార్గెట్ చేసేందుకు సిద్ధమైంది.. ఇది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది... దీని లక్షణాలు డెంగ్యూ వ్యాధిని పోలి ఉంటాయి.. ప్రాథమిక దశలోనే గుర్తించి యాంటీ డ్రగ్ తీసుకుంటే ప్రమాదం లేదు. కిల్లర్ వైరస్‌పై రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు
రాష్ట్ర ప్రజలపై మరో ప్రాణాంతక వైరస్ అటాక్ చేసే ప్రమాదముంది... బన్యా రకానికి చెందిన డేంజర్ వైరస్ హంటర్ వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ ప్రమాదకర రోగకారక వైరస్ ఎలుకల ద్వారా సంక్రమిస్తుందని తేల్చారు.. ఈ వైరస్ సోకితే తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పి వంటి సమస్యలు ఏర్పడుతాయి... ఈ హంటర్ వైరస్ లక్షణాలు హైదరాబాద్‌లో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిలో బయటపడ్డాయి. రాష్ట్రంలో ఇది మొదటి కేసని డాక్టర్లు చెబుతున్నారు. మొదట డెంగ్యూ జ్వరంగా భావించి చికిత్స చేసిన డాక్టర్లు... అది కాదని తేలడంతో ముంబయిలోని ల్యాబొరేటరీల రోగి రక్త నమూనాల పరీక్షలు చేయించగా... హంటా వైరస్‌గా నిర్థారణ అయ్యింది.. ప్రాథమిక దశలోనే ఈ వైరస్‌ను గుర్తించకపోతే ప్రాణాంతకమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు...
హంటా వైరస్ లక్షణాలు...
---- తీవ్ర జ్వరం వస్తుంది
---- ఉన్నట్టుండి కండరాల నొప్పి
---- ఆ తర్వాత B.P. తగ్గుతుంది
---- మూత్రపిండాల పనితీరులో మార్పులు
హంటా వైరస్ వ్యాప్తి ఎలా....
ఎలుకల నుంచి వైరస్ వ్యాపిస్తుంది. ఎలుకలు వదిలిన లాలాజలం.. మూత్రం, మలం ద్వారా వైరస్ విస్తరణ
ముందు జాగ్రత్త చర్యలు...
ఇళ్లు, పొలాల్లో ఎలుకలు లేకుండా చూసుకోవాలి.. వాడుకలో లేని కిటికీలు, తలుపులు తెరచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి స్వచ్ఛమైన నీటిని తాగాలి. వ్యాక్యూమ్ క్లీనర్ వాడేటప్పుడు ముఖానికి ముసుగు వేసుకోవాలి
జ్వరం ఏమాత్రం తగ్గకపోయినా వెంటనే వైద్యులను సంప్రదించాలి... దీంతో ప్రారంభ దశలోనే కిల్లర్ వైరస్ హంటార్‌ను గుర్తించడం వీలవుతుంది.. వెంటనే యాంటీ డ్రగ్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్లు సూచిస్తున్నారు...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి