5, మే 2010, బుధవారం
కాలాన్ని దాటేయొచ్చు... టైంమెషిన్
Categories :
మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకొంటున్నారా.. మీ వారసులు ఎలా ఉంటారో చూడాలనుకుంటున్నారా.. దీనికోసం జాతకాలు తిరగెయ్యక్కర్లేదు.. పంచాంగాలు చూడక్కర్లేదు.. టైమ్మెషిన్ ఎక్కేస్తే చాలు.. భవిష్యత్తులోకి ప్రయాణం చేసేయొచ్చు.. కావల్సిన సంవత్సరానికి వెళ్లిరావచ్చు.. కలగా అనిపిస్తున్నా.. త్వరలోనే ఇది సాధ్యం కానుంది...
మన భవిష్యత్తులోకి మనమే వెళ్లడానికి మార్గం సుగమమవుతోంది. ఏం జరుగుతుందో చూడొచ్చు. ఐదు, పది, పదిహేను.. కావాలనుకుంటే.. వెయ్యేళ్ల తర్వాతకైనా వెళ్లొచ్చు. భవిష్యత్తు చూసుకోవచ్చు. మిషన్‌లో కూర్చుని మీట నొక్కగానే... కాలం పరుగులు పెడుతుంది. కాలం కన్నా వేగంగా మనం దూసుకువెళ్లిపోవచ్చు. సెకన్లు.. నిమిషాలు.. గంటలు.. రోజులు.. వారాలు.. సంవత్సరాలు.. ఇలా.. దాటుకుంటూ వెళ్లిపోవచ్చు... ఒక్కోఏడాదిని ఒక్కరోజులోనే దాటేయొచ్చు. ఈ విశ్వగమనాన్నే మార్చేయొచ్చు..
ఇదంతా అభూతకల్పన అనుకుంటున్నారా.. ఎవరో పుట్టించిన కల్లబొల్లి కబుర్లనుకుంటున్నారా.. కానేకాదు. ఇలా భవిష్యత్తులోకి వెళ్లిపోవడం.. శాస్త్రపరంగా సమ్మతం కాదంటారా.. ఆ అనుమానమూ ఇప్పుడు మీకక్కర్లేదు. ఎందుకంటే.. ఫ్యూచర్లోకి వెళ్లొచ్చని చెబుతోంది విశ్వవిఖ్యాత సైంటిస్ట్.. భౌతికశాస్త్ర పరిశోధకుడు.. స్టీఫెన్ హాకింగ్. తన మాటలతో వరసగా సంచలనాలు సృష్టిస్తున్న స్టీఫెన్ హాకింగ్ దృష్టి ఇప్పుడు భవిష్యత్తులోకి వెళ్లడంపై పడింది. కాంతివేగం కన్నా వేగంగా వెళ్లగలిగితే చాలు.. ఫ్యూచర్‌ను అందుకోవడం సాధ్యమేనంటున్నారు.
ఏదో ఒకరోజు.. ఇలా కాలంతో పాటు ప్రయాణించడం సాధ్యమవుతుందన్నది హాకింగ్ విశ్వాసం. డిస్కవరీ ఛానల్ తీస్తున్న డాక్యుమెంటరీలో ఈ విషయాన్ని హాకింగ్ బయటపెట్టారు. విశ్వంలోనే ఉండే వార్మ్‌హోల్స్ నుంచి.. కాంతివేగంతో వెళ్లితే.. మనం భవిష్యత్తులోకి వెళ్లిపోవచ్చని హాకింగ్ చెబుతున్నాడు. అంటే.. ఫ్యూచర్ మిషన్ సాధ్యం కావాలంటే.. వార్మ్‌హోల్‌ను గుర్తించడంతో పాటు.. అత్యంత వేగంగా ప్రయాణించే స్పేస్షెటిల్ కావాల్సిందే.
కాంతివేగం అందుకోవాలి
వందేళ్ల క్రితం.. గాల్లో ఎగరగలమని ఎవరైనా అనుకున్నారా.? విమాన ప్రయాణం సామాన్యుడికి చేరువవుతుందని ఊహించారా? ఇతర గ్రహాలపైన కాలు పెట్టగలమని భావించారా...? వీటన్నింటికి సమాధానం లేదనే వస్తుంది. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందుతుందని ఎవరూ ఊహించలేదు. పైగా.. ఈ టెక్నాలజీకి రోజురోజుకూ మెరుగులుదిద్దుకొంటోంది. ధ్వనివేగంతో దూసుకుపోయే రాకెట్లను ఇప్పటికే ప్రయత్నిస్తున్నాం. ఇక నెక్ట్స్ మన టార్గెట్ కాంతివేగమే. దాన్ని అందుకోవడం ఇప్పటికిప్పుడు కష్టసాధ్యమే అయినా.. అసాధ్యం మాత్రం కాదు.
సూర్యమండలానికి ఆవల ఉన్న గ్రహాలను చేరుకోవాలన్నా.. ఇతర పాలపుంతల్లోకి ప్రవేశించాలన్నా.. కాంతివేగాన్ని అందుకోవడం తప్పనిసరి. అంతేకాదు.. అంగారకుడిపైకి వ్యోమగాములను పంపాలన్నా.. స్పేస్‌షిప్‌ల ప్రయాణ వేగాన్ని చాలారెట్లు పెంచాలి. మరికొన్ని సంవత్సరాల్లో దీన్ని మనం అందుకునే అవకాశాలున్నాయి.
ఐన్‌స్టీన్ సిద్ధాంతమే ఆధారం
ఇక భవిష్యత్తులోకి వెళ్లడం గురించి మాట్లాడుకుంటే... ఐన్‌స్టీన్ ఎప్పుడో ప్రతిపాదించిన సిద్దాతమే ఈ ప్రయోగానికి పునాది. ఓ పదార్థం అంతరిక్షంలో వేగంగా ప్రయాణిస్తే.. దానిచుట్టూ కాలం నెమ్మదిస్తుందని ఐన్‌స్టీన్ చెప్పాడు. దీన్నే ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ పునరుద్ఘాటిస్తున్నాడు. కాంతి వేగంలో కనీసం 98 శాతంతో ప్రయాణిస్తే.. దాదాపుగా కాలం కదలకుండా ఉంటుంది. ఒక్కోరోజు ప్రయాణానికి మనం భూమ్మీద సంవత్సరకాలాన్ని దాటేయగలుగుతాం. ఇలా కావల్సినంత సేపు ప్రయాణించి.. భూమ్మీదకు చేరుకోవచ్చు. నెలరోజుల పాటు ఇలా ప్రయాణించి వస్తే.. 30 ఏళ్లతర్వాత ఉన్న భూమిని చూడొచ్చు.
ఈ సృష్టిలో అత్యంత వేగంగా ప్రయాణించేదే కాంతి. దీన్ని మించిన వేగాన్ని ఇప్పటివరకూ పరిశోధకులెవరూ గుర్తించలేదు. కాంతివేగమంటే.. సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు. ఇప్పుడు మనం అందుకోవాల్సిన వేగం కూడా ఇదే. ఈ మాత్రం వేగంతో ప్రయాణిస్తే తప్ప ఎంతో విలువైన భవిష్యత్తును ఇప్పటికిప్పుడు చూడలేం. మనిషికి ఏదీ అసాధ్యం కాదు కాబట్టి.. ఈ వేగాన్ని కూడా మరికొన్ని సంవత్సరాల్లోనే అందుకోవచ్చు. స్టీఫెన్ హాకింగ్స్ సిద్ధాంతం సాధ్యమేననంటున్నారు కొంతమంది పరిశోధకులు. బిగ్ బ్యాంగ్ థియరీని పరీక్షించడానికి నిర్మించిన లార్జ్ హాడ్రాన్ కొల్లైడర్లో ఇటీవల చేసిన పరీక్షలు దీన్ని రుజువుచేసేలానే ఉన్నాయని మాంచెస్టర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బ్రియన్ కాక్స్ చెబుతున్నారు. ఎల్‌హెచ్‌సిలో కాంతి వేగంతో పదార్ధాలను డీకొట్టించిన ప్రయోగం నిర్వహించినప్పుడు సెకన్లో ఏడువేలవ వంతు కాలాన్ని అధిగమించినట్టు నిరూపితమైందని కాక్స్ అంటున్నారు. ఈ ప్రయోగాలను మరింతగా చేస్తే.. కాలాన్నికూడా అధిగమించినవాడవుతాడు.. మానవుడు.
శతాబ్దం క్రితం మాట
టైమ్‌మిషన్.. కాలచక్రం.. ఎలా పలికినా.. భూతభవిష్యత్వర్తమాన కాలాల్లోకి ఎటుకావాలంటే అటు వెళ్లగలిగే ఒకేఒక్క వాహనం. టైమ్‌మిషన్ అన్న పదం తొలిసారిగా వాడింది సైంటిస్టులు కాదు.. ఓ నవలా రచయిత. 1895లో H.G.వెల్స్ అనే రచయిత ద టైమ్ మిషన్ అన్న పేరుతో ఓ సైన్స్‌ఫిక్షన్ నవలను ప్రచురించాడు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. 1949లో తొలిసారి బీబీసీలో సీరియల్‌గా ప్రసారమయ్యింది. 1960లో ద టైమ్‌మిషన్ పేరుతో సినిమా రూపుదిద్దుకొంది. నవలతో పోల్చితే.. కథను ఈ సినిమా కోసం మరింతగా అభివృద్ధి చేశారు. ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కడంతో ఇదే తరహాలో మరికొన్ని సినిమాలు తయారయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీలు హాలీవుడ్ టైం మిషన్‌ను అనుకరించాయి.
1991లో తెలుగులో ఇదే కాన్సెప్ట్‌తో ఆదిత్య 369 సినిమా విడుదల్యయింది. మన నేటివిటికీ తగ్గట్లుగా కథనాన్ని మార్చేశారు. చరిత్రలోకి హీరోహీరోయిన్లు వెళ్లడం.. కృష్ణదేవరాయలును కలుసుకోవడం.. అన్నీ వింతగా చూపించారు. ఆ తర్వాత మెషిన్ సరిగ్గా పనిచేయకపోవడంతో భవిష్యత్తులోకి వెళ్లే దృశ్యాలూ ఉంటాయి. హాలీవుడ్లో 1960 లో తీసిన సినిమానే.. 2002లో మళ్లీ తీశారు. ఈసారి గ్రాఫిక్స్.. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి మరింత అద్భుతంగా టైంమిషన్ సినిమాను మలిచారు.
ఇలాంటి మెషిన్‌ను తయారు చేయడం కోసం సైంటిస్టులు ఎప్పటినుంచో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. రకరకాల మిషన్లను తయారు చేస్తూనే ఉన్నారు. రకరకాల ఫార్ములాలను తయారు చేశారు. ఇందులో కాఫీకప్పు ఫార్ములాల నుంచి లేజర్ టెక్నాలజీని వాడుకునే సిద్దాంతాలదాకా ఎన్నో ఉన్నాయి. ఒక ఆబ్జెక్ట్‌ని కాంతి వేగంతో ఎలా ప్రయాణింపచేయాలన్నదే ఈ పరిశోధన ప్రధాన ఉద్దేశం.. ఈ ప్రయోగాల్లో ఇంతవరకూ ఎవరూ సక్సెస్ కాలేదు. కాంతివేగాన్ని అందుకునే మెషిన్‌నూ ఇంతవరకూ తయారు చేయలేకపోయారు. ఓ రకంగా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఈ మెషిన్‌ను తయారు చేయడానికి సరిపోకపోవచ్చు.
చరిత్ర అందదు..
చరిత్రలోకి వెళ్లడం.. నచ్చిన రాజులతో మాట్లాడేసి రావడం.. అప్పటి చరిత్రను తెలుసుకోవడం ఏ మాత్రం సాధ్యంకాదని స్టీఫెన్ హాకింగ్ చెబుతున్నాడు. కాలాన్ని అధిగమించగలమే తప్ప.. గడిచిపోయిన కాలంలోకి వెళ్లగలిగే సిద్దాంతాలేవీ లేవంటున్నాడు. హాకింగ్ చెప్పేదాని ప్రకారం.. భవిష్యత్తులోకి వెళితే.. అక్కడే స్థిరపడిపోవాల్సి రావచ్చు. ఎందుకంటే.. కాలాన్ని వెనక్కి తిప్పే అవకాశం శాస్త్ర పరంగా ఉండదు. టైంమిషన్ కూడా వెనక్కి వెళ్లదు ముందుకు తప్ప. ప్రస్తుత కాలం నుంచి వందేళ్లముందుకు వెళితే.. అక్కడే ఉండాల్సి ఉంటుంది. లేదంటే మరో వందేళ్ల తర్వాతకు వెళ్లొచ్చు. సో.. ఫ్యూచర్లోకి జర్నీ చాలా రిస్క్‌తో కూడుకున్న పనే. ఒకవేళ భవిష్యత్తులోకి వెళ్లి వెనక్కి రాగలిగినా.. ఎన్నో సమస్యలు. కొన్ని లాభాలుకూడా ఉన్నప్పటికీ భవిష్యత్తులోకి వెళ్లే అవకాశం రావడం వల్ల అనర్థాలే ఎక్కువగా జరగొచ్చు. తమదేశంమీద ఏదేశమో దాడి చేస్తుందని అమెరికాకు తెలిసిందనుకోండి.. ప్రపంచం మొత్తాన్ని ముందే నాశనం చేసేస్తుంది. టైమ్‌మిషన్ మనిషి చిక్కితే.. పెద్ద ఉపద్రవం సంభవించినట్లే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మనిషి భౌతికంగా చరిత్రలోకి లేదా భవిష్యత్తులోకి వెళ్ళడం Logical గా సాధ్యం కాదు ఎందుకంటే చరిత్రలోకి ( జరిగిపోయిన కాలం ) వెళ్ళలంటే అది ఇప్పుడు లేదు ఎప్పుడో నాశనమైపోయింది. దాని శిధిలాల పైనే 'ప్రస్తుతం' నిర్మించబడి ఉంది . పోనీ భవిష్యత్తులోకి వెళదామన్నా సాధ్యం కాదు ఎందుకంటె అటువంటి భవిష్యత్తు ఇంకా నిర్మించబడలేదు.
చిన్న పొరపాటు రాశారు. 'వార్మ్‌హోల్' కాదు, 'వర్మ్‌హోల్' అనాలి.
ఈ టైమ్‌ట్రావెల్ కాల్పనిక సాహిత్యానికి బాగుంటుంది. అంతే తప్ప అది జరిగేపని కాదు. There are too many paradoxes associated with it.
చరిత్రలో కొంత భాగాన్ని చూడగలమేమో గానీ, దానిలోకి వెళ్ళలేము
nenu kuda nammanu..logical ga asalu sadhyam kani vishayam idi. enta technology develop aina kuda asadhyam, endukante manam enta prayaninchina ide earth ni kada cheralsindi..mari okkarojulo 30yrs munduki ela vellagalam..
స్టీఫెన్ హాకింగ్ .. పాస్ట్ లొకి కస్టం కానీ ఫ్యూచర్ లొకి వెళ్ళడం సాధ్యం అని చెబుతున్నాడు.. ఒకవేళ ఫ్యూచర్ లొకి ట్రావల్ చేసిన తరువాత మళ్ళి వెనక్కి రావాలంటే పాస్ట్ లొకి ట్రావల్ చేసినట్టే కదా.
.
ఈ Paradox చూడండి...ఒకడు ఫ్యుచర్ లొకి వెళ్ళి ఒక వ్యక్తిని చూసి వెన్నక్కి వచ్చి అతని తండ్రి చంపాడనుకుందాం.. అప్పుడు అతను ఫ్యుచర్ లొ చూసిన వ్యక్తిని ఎలా చూసినట్టు... అసలు అతను పుట్టడు కదా.. ఇలాంటి Paradoxes చాలా వున్నాయి.. అవన్నిటికీ లాజికల్ సమాదానాలు దొరికెవరకు.. ఇవి నమ్మలేం.. మరీ స్టీవన్ హాకింగ్ తప్పు చెబుతున్నాడు అనలేం కానీ.. ఇది పిచ్చ కంఫ్యుషన్.. నేను చూస్తున్నా ఈ సీరీస్ ...
[ I don't have time to type in pure Telugu. Please accept my apology! ]
Even Stephen Hawking is wrong! Are you not believing me? Let's read for clarification:
You can only view the "Past", but you can't go into "Past". Let's consider the "Hubble Telescope". It is not a regular type of telescope. It is collecting more light which includes ultra violate, x-ray and other.
In news papers you may read like this "Hubble pictures 1000 light years back star images". The light takes 1000 years to travel from that star to earth. That means it able to collect (view) the light from past. This clearly clarifies the concept of "going into Past". Again You can only view the "Past", but you can't go into "Past".
When comes to "Time Machine" concepts: Let's say you are going to the nearest star which is 39,900,000,000,000 km away. Your spaceship traveling almost at the speed of light (light can travel 3,00,000 km/second). As per this scenario, you may reach Saturn in about 1,540 days. i.e., in about 4.2 years. You started on April 10th, 2010 to the nearest star. For the total round trip, you may take 8.4 years.
I'm not going further discuss this topic, it may confuse readers. So it clears that "You can only view the "Past", but you can't go into "Past". THERE IS NO CONCEPT OF GOING INTO FUTURE.
Some correction to the last 2nd paragraph sentence: "As per this scenario, you may reach the nearest STAR in about 1,540 days. i.e., in about 4.2 years."
It is Saturn, it is the nearest star!