24, మార్చి 2010, బుధవారం
పెళ్లికి ముందు శృంగారానికి సై..
పెళ్లికి ముంద్ సెక్స్‌లో పాల్గొంటే తప్పేంటి? ఆడామగా కలిసి సహజీవనం సాగిస్తే నేరమేంటి? ఈ ప్రశ్నలు వేసింది.. సుప్రీంకోర్టు. కేవలం ప్రశ్నలతోనే ఆగిపోలేదు.. ఆ ప్రక్రియను సమర్థించే వ్యాఖ్యనూ చేసింది. పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేయడం తప్పుకాదనీ చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్‌తో పాటు.. జస్టిస్ దీపక్‌వర్మ, జస్టిస్ బి.ఎస్.చౌహాన్లతో కూడిన ధర్మాసనం... ఈ వ్యాఖ్యలు చేసింది. పైగా.. స్త్రీ,పురుషుల మధ్య సహజీవనాన్ని.. వివాహానికి ముందు సెక్స్‌ను నిషేధించే చట్టమేదీ లేదనీ పేర్కొంది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు పూర్తిగా చట్టానికి లోబడే ఉన్నాయి. ఈ వివాదమంతా.. ఐదేళ్లక్రితమే మొదల్యయింది. 2005లో ఓ తమిళపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సినీనటి కుష్బూ.. పెళ్లికి ముందు సెక్స్ తప్పేమీ కాదంటూ చెప్పింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. చాలాచోట్ల కుష్బూపై కేసులూ నమోదయ్యాయి. ఇలా తనపై పెట్టిన 22 క్రిమినల్ కేసులను కొట్టేయాలంటూ.. సుప్రీంకోర్టులో ఖుష్బూ స్పెషల్‌లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తన తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. ప్రతివాది న్యాయవాదుల వాదనపై కాస్త ఘాటుగానే సుప్రీం స్పందించింది. ఖుష్బూ వ్యాఖ్యలు ఏ సెక్షన్ కింది నేరమో చెప్పాలంటూ నిలదీసింది.
ఖుష్బూ వ్యాఖ్యలతో ఎవరైనా ప్రభావితమయ్యారా.. ఇళ్లనించి ఎవరైనా పారిపోయారా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. శ్రీకృష్ణుడినీ ఈ వివాదంలోకి లాగింది. రాధాకృష్ణులు సహజీవనం చేశారని పురాణాలనూ ప్రస్తావించింది. ఏదైతేనేం.. ఇప్పుడు సుప్రీం వ్యాఖ్యలతో.. పెళ్లికి ముందు సెక్స్‌కు అంగీకరించేవారికి మాత్రం కొండంత బలం వచ్చినట్లయ్యింది.
రాధాకృష్ణులు సహజీవనం చేశారా..?
ప్రేమికుల్లో ముందు కోవలోని వారు రాధాకృష్ణులు. దేశంలో ఎక్కడికి వెళ్లి చూసినా రాధాకృష్ణ ఆలయాలే ఎక్కువగా ఉంటాయి తప్ప... రుక్మిణీకృష్ణులవో.. శ్రీకృష్ణ సత్యభామలవో ఉండదు. అంతగా చరిత్రలో నిలిచిపోయారు రాధాకృష్ణులు. అమరప్రేమకు వారిద్దరూ ప్రతిరూపాలు. ఎంతోమంది కవులు, చిత్రకారులకు చైతన్యదీపికలు. అందుకే.. వారిద్దరిపై ఎన్నో కవితలు.. కథలు.. మరెన్నో అపురూప చిత్రాలు..
ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రస్తావనతో వీరిద్దరి బంధం మరోసారి వార్తల్లోకి వచ్చింది. రాధాకృష్ణులకు ఇంత ప్రాముఖ్యత లభించడానికి కారణం.. సంస్కృతకవి జయదేవుడు. ఆయన రచించిన గీతాగోవిందంలోని అష్టపదులతో.. రాధాకృష్ణుల ప్రణయగాధ విశ్వవ్యాపితమయ్యింది. రాధాకృష్ణుల ప్రణయతత్వాన్నే పరమార్థంగా భావించేలా ఈ కావ్యాన్ని రచించాడు. రాధనే కథానాయికగా తీసుకొని.. శ్రీకృష్ణుని రాసలీలలను వర్ణిస్తూ.. పీయూషలహరనే గోష్టీరూపకాన్ని కూడా రచించాడు.
వాస్తవానికి శ్రీకృష్ణుడి తొలిప్రస్తావన ఉన్న మాహాభారతంలో రాధ మనకు ఎక్కడా కనిపించదు. భాగవతంలోనూ ఆమె తారసపడదు. కానీ.. 16 వేల మంది గోపికలతో శ్రీకృష్ణుడి రాసలీలలను మాత్రం భాగవతం రమ్యంగా వర్ణిస్తుంది. భారత,భాగవతాలే మన ఇతిహాసాలు కాబట్టి.. వీటిలో రాధ ప్రస్తావన ప్రత్యేకంగా లేదు కాబట్టి... ఆమెను మిధ్యగానే భావించాల్సి ఉంటుంది. కాకపోతే.. జయదేవుని లాంటి కవుల వల్ల రాధ సృష్టించబడి.. ప్రణయకావ్యాల ద్వారా అందరి దగ్గరకీ చేరింది. శ్రీకృష్ణుడి ప్రియప్రేయసిగా అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకొంది.
ఇక రాధ ఎవరన్న దానికి.. గంగాదేవి అని చెబుతుంది దేవీ భాగవతం. నవమస్కందంలో ఈ ప్రస్తావన వస్తుంది. కార్తీక పూర్ణిమ నాడు.. శివుని ఆలాపనకు రాధాకృష్ణులిద్దరూ కరిగి జలంగా మరారట. అప్పటి నుంచే రాధాదేవి.. గంగాదేవిగా మారిందని ఈ పురాణం పేర్కొంటోంది. అసలు రాధ ఉందో లేదో తెలియనప్పుడు.. రాధాకృష్ణులు సహజీవనం చేశారని సుప్రీంకోర్టు చెప్పడం ఆశ్చరాన్ని కలిగిస్తుంది.
చట్టం వేరు.. నైతికత వేరు..
సహజీవనం చేయడమంటే.. పెళ్లికాకుండానే భార్యాభర్తల్లా జీవించడం. రాధాకృష్ణులు ఇదే పని చేశారని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. సాధారణ కేసులో.. పురాణాల ప్రస్తావన తీసుకురావడం కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది. పెళ్లికి ముందు శృంగారానికి.. రాధాకృష్ణులకీ ముడిపెట్టడమూ సరికాదు. ఇక ఖుష్బూ వ్యవహారంలో సుప్రీం కోర్టు మాత్రం పూర్తిగా చట్టానికి లోబడే వ్యాఖ్యానించినట్లు కనిపిస్తుంది. పెళ్లికి ముందు శృంగారం, సహజీవనం నేరం అన్నట్లు మన చట్టాల్లో ఎక్కడా లేదు. దీన్నే సుప్రీం ప్రస్తావించింది. అయితే.. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు.. ఆనాదిగా ఉన్నఆచారాల ప్రకారం చూస్తే మాత్రం.. మన దేశంలో పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం అనైతికం. కులాలు, మతాలుగా దేశం విడిపోయి ఉన్నా.. ఏ వర్గమూ.. ఈ పద్దతిని వ్యతిరేకించలేదు. పెళ్లి అయ్యే వరకూ శృంగారానికి దూరంగా ఉండాలనే అన్ని చోట్లా సామాజిక కట్టుబాటు కొనసాగుతోంది.
అనైతిక పనులన్నింటినీ నేరాలుగా పరిగణించలేమని స్పష్టం చేసేసింది భారతదేశ అత్యున్నత న్యాయస్థానం. అయితే.. ఖుష్బూ వ్యాఖ్యలతో పోల్చితే.. సుప్రీం వ్యాఖ్యలే ఇప్పుడు ఎక్కువ ప్రభావాన్ని చూపించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధర్మాసనమే చెప్పింది కాబట్టి.. పెళ్లికి ముందు సెక్స్ తప్పేమీ కాదన్న భావన పెరిగే ప్రమాదముంది.
పాశ్చాత్య సంస్కృతితో పోల్చితే.. మన దగ్గర పటిష్టంగా ఉన్న కుటుంబ వ్యవస్థకు.. ఈ వ్యాఖ్యలతో బీటలు తప్పవంటున్నారు కొంతమంది. స్త్రీలకు స్వేచ్ఛఉండాలంటూనే.. మరీ విచ్చలవిడిగా వ్యవహరించేలా ఉండకూడదని చెబుతున్నాయి మహిళా సంఘాలు.
సుప్రీం ప్రభావం ఎంత?
పాతతరం సంగతి ఎలా ఉన్నా.. కొత్తతరంపై మాత్రం సుప్రీం వ్యాఖ్యలు గణనీయమైన ప్రభావాన్నే చూపిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. పెళ్లికి ముందు సెక్స్ తప్పేమీ కాదని ఖుష్బూ అన్న వ్యాఖ్యలపై ఐదేళ్లుగా వివాదం జరుగుతోంది. కానీ.. నిజంగా సహజీవనం చేస్తున్న వారిపై మాత్రం.. ఎలాంటి విమర్శలు లేవు. పైగా.. అదో గొప్ప విషయం అన్నట్లుగా ప్రచారం కూడా దొరుకుతుంది. బాలీవుడ్ విషయానికొస్తే.. పెళ్లీ పెటాకులు లేకుండా చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగే హీరో హీరోయిన్‌లు చాలామంది ఉన్నారు. నెలరోజులకో బాయ్‌ఫ్రెండ్‌ను మార్చే హీరోయిన్లు... ఒకేసారి ఇద్దరు ముగ్గురుతో ఎఫైర్‌లు నడిపే హీరోలూ ఉన్నారు. ఇప్పుడు హిందీ సినీ ఇండస్ట్రీలో హాట్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్. కొన్నాళ్లుగా ఇద్దరూ ఒకే ఫ్లాట్‌లో ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది సహజీవనమే. ఇక సల్మాన్ -కత్రీనా, బిపాసాబసు- జాన్ అబ్రహాంల సంగతి అందరికీ తెలిసిందే. కానీ వీళ్లను ఎవరూ ప్రశ్నించరు. కోర్టుల్లో కేసులూ వేయరు.
ఇది కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం అని అనుకోవద్దు. మన దగ్గరా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. హీరో పవన్‌కళ్యాణ్, రేణుదేశాయ్‌తో చాలాకాలం పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాతే.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
అసలు కట్టుబాట్లు ఎక్కువగా ఉండే మనదేశంలోనే.. వాటి ఉల్లంఘన ఎక్కువగా జరుగుతుందని వాదించేవారూ ఉన్నారు. పైగా.. సంప్రదాయాల ముసుగు కప్పుకొని.. గీత దాటివారే సంఖ్యా ఎక్కువే అంటున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనప్పటికీ.. పెళ్లికి ముందు సెక్స్ విషయం కేవలం అనైతికమే అని నిర్దారణ అయ్యింది.
చివరగా అయినా... కచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. శ్రీకృష్ణుడు సహజీవనం చేశాడనే అనుకుందాం.. అందుకని ఇప్పుడు చేస్తే తప్పులేదనడమూ బాగానే ఉంది. మరి కృష్ణుడు 16 వేల మంది గోపికలతో సరసాలాడాడు. 8 మందిని పెళ్లి చేసుకున్నాడు.. సుప్రీం చెప్పే దాని ప్రకారం... ఇలా చేయడమూ తప్పు కాదంటారా...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
The judges should not have refered to epics of a religion. They should have used wisdom, if they have any.
Their knowledge is limited to mere interpretation of law. They can not comment on religious beliefs, epics without valid proofs. It is stupid to compare present law to a law of 5000yrs old. They had their own law suitable to their society and conditions.
vinaasa kaalam vipareeta buddhi
They should be limited to say weather it is a crime or not. I don't think it is wrong to look for a person with belief in one person. Courts should suggest the govt. to impose a way to make it accepted by society.