21, మే 2009, గురువారం
రూటు మారింది
ఏదైతేనేం.. ఎన్నికల్లో ఓటు దెబ్బకు చిరంజీవి మైండ్ బ్లాక్ అయ్యింది. అనూహ్యంగా వచ్చిన ఫలితాలు ఆయనకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీస్థాయిలో సీట్లు రాకపోయినా.. తన మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పడడం కల్లంటూ ఆయన ఇంతకాలం కలలు కన్నారు. కానీ నిజం నిష్టూరం లాంటింది. పట్టుమని ఇరవైసీట్లు కూడా రాకపోవడంతో.. పీఆర్పీ పాత్ర నామమాత్రమైపోయింది. రాష్ట్రమంతా అలుపూ సొలుపూలేకుండా తిరిగిన చిరంజీవి తన లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. అందులో మొదటిది కార్యాలయానికి వచ్చేదారి. ఇంతకాలం ఆయన వెనకవైపునుంచి వచ్చి వెళ్లేవారు. ఫలితాల అనంతరం నేరుగా ప్రధాన ద్వారం నుంచే రావాలని వాస్తుపండితులు ఆయనకు సూచించారట. దీంతో.. ఈ రూట్‌లోనే రావాలని చిరు డిసైడ్ అయ్యారు. అయినా.. రూటు మార్చితే రాత మారిపోతుందంటారా.. శాసనసభలోనైనా చిరంజీవి సినిమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌ను వదిలి.. ప్రజా సమస్యలపై గళమెత్తితే మాత్రం వచ్చేసారి ఆయనకు ప్రజలు పట్టం కట్టడం ఖాయం. జాతకాల్లో కాదు.. చిరంజీవి చేతిలోనే.. పీఆర్పీ భవిష్యత్తు ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి