25, డిసెంబర్ 2012, మంగళవారం
బాలయ్య వెళ్లడం బాబుకు మచ్చా..?
Categories :
balakrishna . chandrababu . modi . POLITICS . tdp . TOP
గుజరాత్లో తిరుగులేని ఆధిక్యంతో అధికారం నిలబెట్టుకున్న నరేంద్రమోడి ప్రమాణస్వీకారానికి నందమూరి బాలకృష్ణకు ఆహ్వానం అందిందన్న వార్తపై, రాజకీయవర్గాల్లో జోరుగా చర్చసాగింది. నరేంద్రమోడి ప్రమాణ స్వీకారానికి బాలయ్య వెళ్లడమేమిటంటూ చాలా మంది విస్తుపోయారు. బీజేపీకి దూరంగా ఉండాలనుకుంటున్న సమయంలో బాలయ్య ఈ బాంబు పేల్చారేమిటా అని టీడీపీ నేతలూ తెగ మథన పడిపోయారు. చివరకు కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తూ.. తెలంగాణ ప్రాంత నేతలతో సమావేశం పెట్టిన చంద్రబాబుతో ఈ విషయంపై చర్చ కూడా చేశారు. బాలయ్య వెళ్లడం సరికాదని బాబు కూడా అన్నట్లు సమాచారం. చివరకు అన్ని వైపుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో.. బాలయ్యే తన టూర్ ను రద్దు చేసుకున్నారు. మోడి ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదంటూ ప్రకటించారు. అంతటితో వివాదానికి ముగింపు పడింది.
అయితే, మోడి ప్రమాణ స్వీకారానికి బాలయ్య వెళ్లడం నేరమా..? ఘోరమా..? ప్రధానిగా మన్మోహన్ ప్రమాణస్వీకారానికి బీజేపీనేతలు వెళతారు కదా..? రాష్ట్రంలోనూ సీఎం ప్రమాణస్వీకారానికి ప్రతిపక్షనేతలు వెళ్లడమూ సహజమే కదా..? అలాంటప్పుడు ఎక్కడో మోడి ప్రమాణస్వీకారానికి బాలయ్య వెళ్లడం తప్పెలా అవుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి