26, ఫిబ్రవరి 2012, ఆదివారం
మొదలయ్యింది నోట్ల ప్రవాహం
Categories :
byeelection . cashflow . news . TOP
ఉపఎన్నికల్లో నోట్ల ప్రవాహం మొదలయ్యింది. మహబూబ్‌నగర్ జిల్లాలోకి లక్షలకొద్దీ డబ్బు అక్రమంగా రవాణా అవుతోంది. తిమ్మాజిపేట మండలం మరికల్‌లో ఓ వ్యాపారి వద్ద నుంచి పోలీసులు 4లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పెద్దకొత్తపల్లిలో రోజూవారీ తనిఖీలు నిర్వహిస్తుండగా సిల్వర్ కలర్ కారులో 6 లక్షల నగదు దొరికింది.. వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఆ మొత్తాన్ని సీజ్ చేశారు.. ఈ నగదు హైదరాబాద్‌కు చెందిన బట్టల వ్యాపారికి చెందినది భావిస్తున్నారు. అయితే నగదుతో పట్టుబడిన యువకుడి కథనం మరోలా ఉంది.. జిల్లాలో బట్టల షాపులకు
క్రెడిట్‌పై ఇచ్చిన స్టాక్‌కు సంబంధించి వసూలు చేసిన సొమ్మని చెబుతున్నారు. దానికి సంబంధించి అన్నిఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ఉపఎన్నికల్లో ధన ప్రవాహం ఏరులై పారే సూచనలు కనిపిస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి