6, ఆగస్టు 2011, శనివారం
వీళ్లు పాండవులైతే.. కౌరవులెవరు?
తెలంగాణ విషయంలో అందరికన్నా ఓ అడుగు వెనుకుండే మంత్రి దానం నాగేందర్, తమకు తామే కొత్త బిరుదునిచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యోగులు తలపెట్టిన సమ్మె నివారణకు కేబినెట్ సబ్ కమిటీ తీవ్రంగా ప్రయత్నిస్తుందన్న దానం, సెక్రటేరియెట్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. " తెలంగాణకు సంబంధించి 114 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే, మిగిలిన నలుగురైదుగురు ఎలా సమ్మెను ఆపుతారు? అసలు సమ్మెను నిరోధించే విషయంలోనే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి కదా..?" అంటూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానమిచ్చారు దానం. పాండవులు ఐదుగురే అంటూ చెప్పేసి వెళ్లిపోయారు. దానం మాటల్ని బట్టి చూస్తే... రాజీనామాలు చేయని తెలంగాణ ప్రజాప్రతినిధులంతా పాండవులన్న మాట.. అలాగే అనుకుంటే.. కౌరవులెవురు? రాజీనామాలు చేసిన తెలంగాణ ప్రజాప్రతినిధులేనా...? దానం సార్... కొంచెం క్లారిటీ ఇవ్వండి..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి