17, జులై 2011, ఆదివారం
కుండలిని అట.. తలకు ఇంజెక్షన్లు చేసుకోవాలట..
కుండలినీ యోగం.. బెంగళూరులో నిత్యానంద ప్రదర్శించిన మాయాజాలం. రాసలీలల వ్యవహారంతో... పడ్డ మచ్చను చెరిపేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న నిత్యానంద.. కుండలినీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భక్తులు గాల్లోకి ఎగురుతూ ఉంటే.. అదే కుండలినీ శక్తి అన్నారు. కానీ, ఓ జర్నలిస్ట్ తననూ అలాగే చేయమనేసరికి కథ అడ్డం తిరిగింది..
గాల్లోకి ఎగిరారు. పిచ్చోళ్లలా ప్రవర్తించారు. చూస్తున్న వారందరికీ విస్మయం కలుగుతోంది. టీవీల్లో చూసిన వారంతా ఇదేం పిచ్చనుకున్నారు. అలాగని వీళ్లముందుకొచ్చే పిచ్చోళ్లని అంటే ఊరుకోరు.. వీరంతా నిత్యానంద భక్తులు. స్వామీజీ మాటల్లోనే చెప్పాలంటే.. అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని అనుభవిస్తున్న యోగులు. ఆ శక్తి మరోమిటో కాదు.. కుండలిని.
ఆత్మచైతన్యంతో పాటు.. వాయు స్తంభన శక్తినీ కుండలినీ కల్పిస్తుందని నిత్యానంద ప్రచారం చేస్తున్నారు.. కుండలినిపై అంతర్జాతీయ పరిశోధకులు చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తన భక్తులతో కుండలినీ శక్తిని ప్రదర్శించారు. వీడియో టేపులతో అభాసుపాలైన సినీనటి రంజిత కూడా వీటికి హాజరయ్యింది. పిచ్చిపిచ్చిగా ఎగురుతున్న వాళ్లను చూసి, నిత్యానంద మురిసిపోతే.. ఓ జర్నలిస్ట్‌కు మాత్రం ఒళ్లుమండింది. నిత్యానంద చెప్పే కుండలిని నిజమే అయితే.. తననూ అదే స్థితిలోకి తీసుకువెళ్లాలంటూ.. సవాల్ విసిరాడు. ఓస్.. అదెంత పనన్న నిత్యానంద.. ఆ జర్నలిస్ట్‌పై తన ప్రయోగాన్ని మొదలుపెట్టాడు..
తలకు ఓ ప్రత్యేకమైన క్లాత్‌ను కట్టి.. నేరుగా ఇంజెక్షన్లను ఇప్పించాడు. ఆ తర్వాత ఓ మిషన్‌ను జతచేశారు. బ్రెయిన్లో మార్పులను ఇది సూచిస్తుందని చెప్పారు. కానీ, ఎంతసేపు ట్రై చేసినా.. నిత్యానంద భక్తుల్లా జర్నలిస్ట్‌కు మాత్రం పూనకం రాలేదు. అంతే.. నిత్యానందను అందరిముందూ నిలదీశాడు. అందరినీ మోసం చేస్తున్నావంటూ విమర్శించాడు.
నిత్యానంద చేసేదంతా వట్టి మోసమేనని ఈ విషయంతో తేలిపోయింది. కానీ, తప్పు ఎక్కడపడుతుందోనన్న భయంతో, ప్లేటు తిరగేశాడు నిత్యానంద. నీ మనసు అదుపులో లేదని, నీ దృష్టి ఎక్కడో ఉందని తేల్చేశాడు. అందుకే.. గాల్లోకి తేలలేకపోయావని చెప్పాడు. కానీ, వ్యవహారం చూస్తే మాత్రం.. ఇంజెక్షన్లు ఇచ్చి మరీ భక్తులను పిచ్చోళ్లను చేస్తున్నట్లే కనిపిస్తోంది. నిత్యానంద భక్తులూ.. ఇకనైనా తేరుకోండి. లేదంటే, ఏదో రోజు మీ తలల్లోకూ ఇంజెక్షన్లు ఇచ్చి.. మిమ్మల్నీ లొంగదీసుకుంటాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సత్యం,
మీ అదృష్టం ఇంజక్షనే అన్నాడు
రోకలి తలకి చుట్టమంటే బరువు తో మీరు బాధ పడేవారు.
జనం దొరుకుతున్నన్ని రోజులు ఈ ఆనందులకీ, నిత్య మోసాలకూ హద్దే వుండదు.
గతం లో జరిగిన సంఘటనలు చూసి కూడా భక్తులు అయన చుట్టూ తిరుగుతున్నారంటే " ఏదో " ఆశించే ఉంటుంది.
మీరు వాళ్ళనెందుకు డిస్టర్బ్ చేస్తారు?
లెట్ దెం ఎంజాయ్ !!