21, ఫిబ్రవరి 2013, గురువారం
సీబీఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ:బ్రదర్ అనిల్
Categories :
brother anil . jagan . POLITICS . TOP
ఆ మధ్య బయ్యారం గనుల్లోను, ఈమధ్య అగస్టా హెలికాప్టర్ స్కాం, మణికొండ భూముల కబ్జా విషయంలోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ బావ బ్రదర్ అనిల్.. సీబీఐకు కొత్త అర్థం చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై తమ కుటుంబాన్ని కార్నర్ చేశాయని, సీబీఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని విమర్శించారు అనిల్. తనపై ఆరోపణలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందని, రేపు బోఫోర్స్ కుంభకోణంలోనూ తన పాత్ర ఉంటుందని చెబుతారని విమర్శించారు. అందుకే టీడీపీ నేతలపై పరువునష్టం దావా వేస్తున్నట్లు ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మణికొండ భూములతోనూ, హెలికాప్టర్ స్కామ్ తోనూ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు బ్రదర్ అనిల్.ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి