3, ఆగస్టు 2011, బుధవారం
సముద్రంలో కూలిన ఏలియన్ వాహనం?
గ్రహాంతరవాసులున్నారని విశ్వసించే వారికి మరో శుభవార్త. సాగరగర్భంలో ఎగిరేపళ్లాన్ని పోలిన ఓ వస్తువును పరిశోధకులు గుర్తించారు. ఇది ఏలియన్ స్పేస్ షిప్ కావచ్చని, ప్రమాదవశాత్తూ అక్కడ కూలిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. స్వీడన్-ఫిన్ లాండ్ మధ్య ఉన్న సముద్రంలో దాదాపు 300 అడుగుల లోతున దీన్ని గుర్తించారు. శతాబ్దాల నాటి అవశేషాలను కనిపెట్టడానికి పీటర్ లిండ్ బెర్గ్ చేస్తున్న పరిశోధనల్లో ఇది బయటపడింది. సోనార్ స్కానింగ్ లో గుండ్రని ఆకారం కనిపించడంతో దాన్ని మరింతగా పరిశీలించారు.
దానిచుట్టూ గీతలు పడి ఉండడంతో అది కదలడానికి కూడా ప్రయత్నించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గుండ్రంగా ఉంది కాబట్టి యూఎఫ్ఓ కావచ్చన్నది వీరి అంచనా. అయితే, దీన్ని కచ్చితంగా నిర్ధారించలేదు. స్టోన్ హెంజ్ తరహా నిర్మాణం కావచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన ఫోటోలు చూసి చెబుతున్నారు.
దీని వైశాల్యం 60 మీటర్లు ఉంది. దాదాపు 18 ఏళ్లుగా సముద్రాలపై పరిశోధన చేసిన తనకు ఇంతవరకూ ఇలాంటి ఆకారం ఎక్కడా తారసపడలేదంటున్నారు పీటల్ లిండ్ బెర్గ్. అయితే.. దీనిపై మరింతగా పరిశోధనలు చేయడానికి ఆయన దగ్గర బడ్జెట్ లేదంట.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి