15, జులై 2011, శుక్రవారం
బెజవాడ రౌడీలకు బెజవాడ పోలీసుల దెబ్బ
Categories :
బెజవాడ రౌడీలకు బెజవాడ పోలీసులు బ్రేక్ వేశారు. రౌడీలకు పోలీస్ పవర్ ఏమిటో చూపించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరెన్ని చెప్పినా టైటిల్ మార్చేదే లేదంటూ వర్మ తీస్తున్న బెజవాడ రౌడీలు షూటింగ్‌ను విజయవాడ పోలీసులు అడ్డుకున్నారు. షూటింగ్ అనుమతి పత్రాలను చూపించాలని సూర్యారావుపేట పోలీసులు కోరినా వాటిని అందించకపోడంతో షూటింగ్‌కు పోలీసులు బ్రేక్ వేశారు. గత మూడు రోజులు గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామ పరిధిలో బెజవాడ రౌడీలు షూటింగ్ జరిగింది. ఈరోజు విజయవాడ 5వ నెంబర్ రోడ్డులో షూటింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా పర్మిషన్ లేదంటూ పోలీసులు అభ్యంతరం చెప్పారు కేవలం ఇండోర్ షూటింగ్‌కు మాత్రమే అనుమతి ఉందని...అవుట్ డోర్లో అనుమతించమని...తేల్చి చెప్పారు. దీంతో బెజవాడ రౌడీలు షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది.
బెజవాడ రౌడీలు టైటిల్ సాంగ్ ను కింద లింకును క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
DOWNLOAD SONG
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి