క్రికెట్ నుంచి తనరిటైర్మెంట్ పై కొన్నాళ్లుగా సాగుతున్న చర్చకు తెరదించాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే సచిన్ టీట్వంటీలు ఆడడం లేదు. దీంతో ఇకపై సచిన్ పూర్తిగా టెస్ట్ క్రికెట్ కే పరిమితం కానున్నాడు. కొంతకాలంగా వన్డేల్లోనూ, టెస్టుల్లో సచిన్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లోనూ సచిన్ ఏమాత్ర రాణించలేదు. దీంతో ప్రస్తుతానికి వన్డేల నుంచి రిటైర్ అయ్యి.. టెస్ట్ క్రికెట్ పైనే దృష్టి పెట్టాలని సచిన్ భావించినట్లు తెలుస్తోంది. అయితే.. పాకిస్తాన్ తో మరికొన్ని రోజుల్లో జరగనున్న వన్డే సిరిస్ నేపథ్యంలో సచిన్ ఈ ప్రకటన చేయడం సంచలనం కలిగిస్తోంది. చిరకాల ప్రత్యర్థులైన పాక్ తో ఆడకుండానే సచిన్ రిటైర్ అవ్వడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తోంది. 1989లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ తోనే సచిన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అంతేకాదు.. వన్డేల్లో మరో సెంచరీ చేస్తే.. సెంచరీల హాఫ్ సెంచరీని చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా సచిన్ చరిత్రలో నిలిచిపోయేవాడు. అయితే.. పాక్ సిరీస్ ఈ సెంచరీ సాధిస్తానన్న నమ్మకం లేకపోవడం వల్లే బహుశా సచిన్ రిటైర్ అయ్యి ఉండొచ్చు.
ఇప్పటివరకూ 463 వన్డేలు ఆడిన టెండుల్కర్, 18426 పరుగులు సాధించాడు. 49 సెంచరీలు,96 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో తొలి డబుల్ సెంచరీ సాధించింది కూడా సచినే. వన్డే రిటైర్మెంట్ ప్రకటనతో మరికొంత కాలమైనా టెస్ట్ క్రికెట్లో ఆడే అవకాశం ఉంటుందని సచిన్ భావిస్తున్నట్లు సమాచారం. సచిన్ నిర్ణయంతో 23ఏళ్ల సుదీర్ఘ వన్డే కెరీర్ ముగిసింది.
Read more...
retirement లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
retirement లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
23, డిసెంబర్ 2012, ఆదివారం
5, అక్టోబర్ 2012, శుక్రవారం
రిటైర్మెంట్ పై నవంబర్లో చెబుతా:సచిన్
Categories :
CRICKET . retirement . sachin . sports . TOP
రిటైర్మెంట్ విషయంలో తొలిసారి నోరు విప్పాడు మాస్టర్ బ్లాస్టర్. టైమ్స్ నౌ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పాడు. అయితే, రిటర్మెంట్ విషయంలో తన మనసు చెప్పిందే వింటానన్నాడు. ఇంతవరకూ, రిటర్మెంట్ అవ్వాల్సిన సమయం వచ్చిందన్న సంగతిని గుర్తుచేసే సంఘటనేదీ జరగలేదన్నాడు. నవంబర్లో సిరీస్ ఆడే సమయంలో తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నాడు. 25 ఏళ్ల వయస్సులోనూ మూడుసార్లు వరసగా క్లీన్ బౌల్డ్ అయ్యానన్న సంగతిని గుర్తుచేసుకున్న టెండుల్కర్.. అప్పుడు తననెవరూ విమర్శించలేదన్నాడు.
Read more...
8, మార్చి 2012, గురువారం
క్రికెట్ నుంచి ద్రావిడ్ రిటైర్మెంట్
భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన రాహుల్ ద్రావిడ్.. రిటైర్ కాబోతున్నాడు. అధికారికంగా రిటైర్మెంట్ ను ప్రకటించడానికి రేపు బెంగళూరులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆసీస్ టూర్ లో వైఫల్యం చెందిన ద్రావిడ్.. యువకులకు అవకాశం ఇవ్వడం కోసమే రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ది వాల్ గా పేరు గాంచిన ద్రావిడ్.. టెస్టుల్లో అత్యధికపరుగులు చేసిన జాబితాలో రెండో వ్యక్తి. 164 టెస్టు మ్యాచ్లు ఆడిన ద్రావిడ్.. 13288 పరుగులు చేశాడు. 36 సెంచరీలు (ఇందులో ఐదు డబుల్ సెంచరీలు), 63 అర్థసెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. 25 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించిన కాలంలో భారత్ 8 మ్యాచుల్లో గెలుపొందింది. ఆరింట ఓడిపోయింది. సీనియర్లు వైదొలగాలంటూ కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో గౌరవప్రదంగా టీమ్ నుంచి సెలవుతీసుకుంటున్నాడు రాహుల్ ద్రావిడ్.
Read more...
12, జనవరి 2012, గురువారం
టెస్ట్ క్రికెట్ కు ధోనీ బైబై..
భారత్ క్రికెట్ ప్రపంచానికి వరస విజయాల రుచి చూపించిన సూపర్ కెప్టెన్ ధోనీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు. వచ్చే ఏడాదితో టెస్ట్ కెరీర్ ను ముగించాలని నిర్ణయించుకున్నాడు. 2015 వన్డే ప్రపంచ కప్ లో ఆడడానికి వీలుగా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నాడు. త్వరలోనో ఓ ఫార్మాట్ నుంచి తప్పుకుంటానని నేరుగా మహీనే ప్రకటించడంతో.. యావత్ క్రికెట్ ప్రపంచం షాక్ అయ్యింది. దేశం తరపున 66 టెస్టు మ్యాచ్ లు ఆడిన ధోనీ 36 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. కెప్టెన్ గా 17 టెస్టుల్లో విజయాన్ని అందించాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా , బ్యాట్స్ మెన్, కీపర్ గా పేరు గాంచిన ధోనీ ఇంత తక్కువ సమయంలోనే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలనుకోవడం.. చాలామంది అభిమానులకు నిరాశనే కలిగిస్తోంది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)



