12, ఫిబ్రవరి 2013, మంగళవారం
బండ్ల గణేశ్ పని అయిపోయిందా..? బాద్షా ఆగిపోతుందా..?
Categories :
bandla ganesh . cinema . entertainment . income tax . it raids . news . tollywood . TOP
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొంతకాలం తెలుగు తెరపై కనిపించి, కనుమరుగై భారీ ప్రొడ్యూసర్ గా ఒక్కసారిగా దూసుకొచ్చిన బండ్ల గణేశ్ కష్టాల్లో పడినట్లు తెలుస్తోంది. వరసగా హిట్లు సాధించి భారీగా సంపాదిస్తూ.. గబ్బర్ సింగ్ దెబ్బ టాప్ రేంజ్ కు వెళ్లిపోయాడు గణేశ్. ఆ ఎఫెక్ట్ తోనే ఎన్టీఆర్ తో బాద్షా, అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో మొదలుపెట్టేశాడు. త్వరలోనే రాంచరణ్ హీరోగా, మిర్చి డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమాకు స్కెచ్ వేసాడు. ఇక తనకు తిరుగులేదనుకుంటున్న సమయంలో ఐటీ అధికారులు ఝలక్ ఇచ్చారు.
సోమవారం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకూ గణేశ్ కార్యాలయంలో భారీగా సోదాలు చేశారు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు. గబ్బర్ సింగ్ తో పాటు ఇతర లావాదేవీలపై కూపీ లాగారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవడానికి బండ్ల గణేశ్ ను మంగళవారం తమ కార్యాలయానికి పిలిపించుకుని ప్రశ్నించారు. ఒకవేల అక్రమాలు అవకతవకలు బయటపడితే మాత్రం గణేశ్ భారీగా జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. దీని ప్రభావం ప్రస్తుతం షూటింగ్లో ఉన్న బాద్షా, ఇద్దరమ్మాయిలతో పైనా పడే అవకాశం ఉందంటుదన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ కు, పీసీసీ చీఫ్ బొత్సకు బాగా సన్నిహితుడని పేరున్న గణేశ్ ఈ కష్టాలనుంచి ఎలా బయటపడతాడో చూడాలి.
సినీ ఇండస్ట్రీలో బాగా డబ్బు సరఫరా అవుతోందని, అంతా పన్ను ఎగ్గొడుతున్నారని భావిస్తున్న ఐటీ అధికారులు కొంతకాలంగా టాలీవుడ్ పై దృష్టి పెట్టారు. కొంతకాలం టాప్ హీరోయిన్ల ఇళ్లపైనా, ఈ మధ్యలో బుల్లితెర యాంకర్లపైనా విరుచుకుపడ్డారు. ఇప్పుడు నిర్మాతల వంతు వచ్చినట్లుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి