5, డిసెంబర్ 2012, బుధవారం
ఆనాటి జగన్ కు .. ఈనాటి జగన్ కు ఎంత తేడా..?
పీక్కుపోయిన మొహం.. లోపలికి పోయిన కళ్లు.. చిరాగ్గా గడ్డం... అలసిపోయినట్లున్న దేహం.. అరెస్ట్ అయ్యే సమయానికి జగన్ పరిస్థితి. వరసగా ఓదార్పు యాత్ర, దీక్షలు, పార్టీ వ్యవహారాలు, వ్యాపార లావాదేవీలతో క్షణం తీరిక లేకుండా గడపడంతో అప్పట్లో చాలా నీరసంగా కనిపించారు జగన్.
జైల్లోకి వెళ్లిన తొలి రోజుల్లోనూ ఆయనలో పెద్దగా మార్పు రాలేదు. రెండు మూడు సార్లు గడ్డంతోనే కోర్టుకు వచ్చారు. కానీ, ఈ సారి దాదాపు 71 రోజుల తర్వాత చంచల్ గూడ జైలు నుంచి బయట అడుగుపెట్టారు జగన్. ఈ సారి మాత్రం ఆయనలో ఎంతో మార్పు కనిపించింది. కొద్దిగా ఒళ్లు చేశారు. మళ్లీ మొహంలో చైతన్యం కనిపిస్తోంది. కళ్లు యాక్టివ్ అయ్యాయి. బయట విశ్రాంతి లేకుండా పోయిన జగన్ కు జైల్లో కావల్సినంత రెస్టు దొరికినట్లు కనిపిస్తోంది. పైగా షేవింగ్ తో బయటకు రావడంతో జగన్ లో మళ్లీ కొత్త కళ కనిపిస్తోంది. జైల్లో జగన్ ఎలా ఉన్నాడో అంటూ మధన పడుతున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు, జగన్ లో కనిపించిన ఉత్సాహం బూస్ట్ ఇచ్చినట్లే..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఆ ఆస్తులు ఉన్నంత వరకూ అభిమానులకు బూస్ట్ ఉంటుంది..ఆస్తులు గానీ పోయాయో...ఒక్క నా కొడుకూ ఉండడు జగన్ వెనుక...జనాలు ఆయన వెనుక ఉన్న ఆస్తికి (సబ్ కాన్షియస్ గా) ఎట్రాక్ట్ అయ్యి వెంట పడుతున్నారు...అంతలా సంపాదించాలని ఆరాటం మన జనాలకు...అది చేసి చూపి నందుకు ఆరాధన ..జనాన్ని తక్కువ అంచనా వెయ్యకండీ...దగుల్బాజీలు...