20, జులై 2011, బుధవారం
భారములన్నిటికి నీవెయనుచు
Categories :
రాగం - ఆనందభైరవి
తాళం - త్రిపుట
భారములన్నిటికి నీవెయనుచు నిర్భయుండనై యున్నానురా శ్రీరామా
దారి తప్పక నీవు దరివని ధైర్యము తోచినదిరా శ్రీరామా
|| అతి దుష్కౄతముల నెన్నో నే చేసితిని | అయిన మరేమాయెరా రామా |
పతితపావనుడను బిరుదువహించిన నీ | ప్రఖ్యాతి విన్నానురా శ్రీరామా ||
|| ఏరీతినైన నే నిన్ను నమ్మియున్నాడ న | న్నేలుకొనుట కీర్తిరా రామా |
నేరను నేరము లెంచి చూచుటకు | నే నెంతవాడనుర శ్రీరామా ||
|| మును నిను జేరి కౄతార్థులైన వారి | ముచ్చట విన్నానురా రామా |
విని విననట్లున్నావేమిరా పలుమారు | విన్నవించ నేరనుర శ్రీరామా ||
|| శరణన్నవారి రక్షణచేయు బిరుదు | నిశ్చయమై నీకున్నదిర రామా |
మురిపెముగా నన్నిటికి నేపట్టినది | మునగ కొమ్మ గాదురా శ్రీరామా ||
|| బహువిధముల నిన్ను ప్రస్తుతించమని | బ్రహ్మ వ్రాసినాడురా రామ |
విహితజనముల లోనే నెవ్వడోయని | వేరుచేయక బ్రోవరా శ్రీరామా ||
|| వాసిగ భద్రాచలేశుడవని చాల | వర్ణించు చున్నానురా రామ |
భాసురముగ రామదాసు నేలునట్టి | భావముగన్నానురా శ్రీరామా ||
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి