Pages

30, ఏప్రిల్ 2014, బుధవారం

పాపం బ్రహ్మీ..

ఓటు హక్కు వినియోగించుకుందామని ఎంత కోరిక ఉన్నా, అధికారుల తీరుతో కొంతమంది ఓటు వేయలేకపోతున్నారు. ఓట్లు గల్లంతు కావడంతో పోలింగ్ కేంద్రాల నుంచి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. భార్యతో కలిసి ఆయన జూబ్లీహిల్స్లో ఓటు వేయడానికి వచ్చారు. కానీ, లిస్ట్లో వారి పేర్లు లేకపోవడంతో వెనుదిరిగారు. ఇక ప్రముఖ ఐఏఎస్ అధికారి టి.రాధ కుటుంబం ఓట్లు కూడా గల్లంతయ్యాయి. గత ఎన్నికల్లో కుటుంబసమేతంగా ఓటు వేశామన్న ఆయన.. ఈ సారి ఓట్లు గల్లంతు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పేర్లను తొలగించడంపై న్యాయపోరాటం చేస్తానన్నారు రాధ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి