Pages

30, ఏప్రిల్ 2014, బుధవారం

చిరూ.. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో..!

హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన చిరంజీవికి షాక్ ఇచ్చారు జూబ్లీహిల్స్ ఓటర్లు. కేంద్రమంత్రిననో, వీవీఐపీననో గానీ చిరంజీవి నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లిపోయారు. దీంతో , అప్పటికే అక్కడ క్యూలో ఉన్న ఓటర్లకు ఒళ్లుమండి ఆయన్ను వెనక్కు పిలిచారు. క్యూలో ఉండి ఓటేయాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీ లేక.. ఆయన క్యూలో నిలబడ్డారు.ఈ విషయం మీడియాలో జోరుగా ప్రసారం కావడంతో, ఓటేసిన అనంతరం వివరణ ఇచ్చారు చిరంజీవి. తన ఓటు ఉందో లేదో తెలుసుకుందామన్న ఉద్దేశంతోనే లోపలికి వెళ్లానే తప్ప, నిబంధనలను ఉల్లంఘించాలన్న ఉద్దేశం తనకు లేదన్నారాయన. గతంలో కర్నాటక ఎన్నికల్లోనూ బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడికీ ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి