తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఖరారయ్యింది. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడనున్న తెలంగాణ రాష్ట్రం జూన్ 2 నుంచి ఉనికిలోకి రానుంది. ఫిబ్రవరి 20 న పార్లమెంట్ ఆమోదంతో ఏర్పాటైన తెలంగాణ, జూన్ 2 నుంచే ప్రత్యేక రాష్ట్రంగా విధులను నిర్వహించనుంది. అయితే పార్లమెంట్ నిర్ణయం ప్రకారం పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై కేంద్రం ప్రకటన చేయడంతో, రెండు రాష్ట్రాలకు వేరువేరు షెడ్యూల్స్ లో ఎన్నికలు జరగనున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి