ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 9 విడతల్లో ఈ సారి ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 30, మే 7న రెండు విడతల్లో ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. ముందుగా తెలంగాణలోనూ, ఆ తర్వాత ఆంధ్రలోనూ ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 7 న తొలి విడతలో 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 9న 14 రాష్ట్రాల్లో రెండో విడత పోలింగ్ జరుగుతుంది. 10న మూడో విడత, 12న నాలుగో విడత, 17న ఐదో విడత, 24న ఆరో విడత, 27న ఏడో విడత, మే 7న ఎనిమిదో విడత, మే 12న తొమ్మిదో విడత ఎన్నికలు నిర్వహిస్తారు. మే 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జూన్ 1 తో పార్లమెంట్ కాలపరిమితి, జూన్ 2తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా కేంద్ర ప్రకటించడంతో ఆ రోజే కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి