Pages

8, నవంబర్ 2013, శుక్రవారం

షమి షాన్‌దార్ షో

తొలి టెస్ట్ ఆడుతున్నషమి... ఈడెన్ గార్డెన్స్ లో షాన్‌దార్ షో చూపించాడు. ఎన్నాళ్లకెన్నాళ్లకో అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ ను చూపించి, అభిమానులను అబ్బుర పరచడమే కాదు, మరే ఫాస్ట్ బౌలర్ పేరిటాలేని అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే 9 వికెట్లు తీసిన ఏకైక భారత ఫాస్ట్ బౌలర్‌గా అవతరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన షమి, రెండో ఇన్నింగ్స్‌లో మరింత మెరుగ్గా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ తొమ్మిది వికెట్లలోనూ ఆరు వికెట్లు బౌల్డ్ చేయడం ద్వారానే సాధించాడంటే ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. అశ్విన్ కూడా తన అరంగేట్ర మ్యాచ్‌లోనే 9 వికెట్లు పడగొట్టాడు. అటు డబుల్ సెంచరీ దిశగా పరుగు పెట్టిన రోహిత్, ఆ ఛాన్స్‌ను మిస్సయ్యాడు. ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లు ఏమీ చేయలేక చేతులెత్తేస్తే, తొలి టెస్ట్ ఆడుతున్న రోహిత్, షమిలే బాధ్యతలను భుజాన వేసుకుని, భారత్‌ను విజయతీరాలకు నడిపించారు. హ్యాట్సాఫ్ రోహిత్ అండ్ షమి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి