Pages

8, నవంబర్ 2013, శుక్రవారం

ప్రధాని కార్యాలయం ఎందుకు పిలిచినట్లు?

ఢిల్లీలో కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీకి హాజరవడానికి హస్తినకు వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. శనివారం ఉదయం 10.30కు జరిగే సమావేశానికి హాజరుకావాలంటూ వర్తమానం అందించారు పీఎంఓ అధికారులు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలతోనూ త్వరలోనే మంత్రుల బృందం సమావేశమవుతున్న నేపథ్యంలో, అందరూ కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం లేదనే ఒత్తిడి తెస్తారు కాబట్టే, ముగ్గురు నేతలతో ప్రధాని సమావేశమవుతున్నట్లు సమాచారం. విభజనకు అంగీకరించాలని కిరణ్‌ను, బొత్సను ప్రధాని కోరే అవకాశాలున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి