Pages

2, నవంబర్ 2013, శనివారం

ఉల్లి ధర పెరగడానికి మోడీ కారణమా..?

యాభై రూపాయలను ఎప్పుడో దాటిసేన కిలో ఉల్లి ధర, వడివడిగా వందవైపు పరుగులు పెడుతోంది. ధరలు తగ్గుతాయంటూ ఈ మధ్య కేంద్రమంత్రి శరద్ పవార్ చెప్పినప్పటికీ, వాస్తవంలో మాత్రం అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. నాసిరకం ఉల్లి యాభై రూపాయలు పలుకుతుంటే కాస్త నాణ్యమైన ఉల్లిపాయలు మాత్రం కిలో 65 నుంచి 70 రూపాయల మధ్య అమ్ముడవుతున్నాయి. కేంద్రం అలసత్వం వల్లే ఉల్లి ధర పెరుగుతోందంటూ ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ విరుచుకుపడుతుండడంతో, కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. ఉల్లి ధరలు పెరగడానికి గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని కారణమంటూ విమర్శించారు కేంద్రమంత్రి కపిల్ సిబల్.

గుజరాత్‌లోని ఖచ్ ప్రాంతంలో ఉల్లిపాయలు ఎక్కువగా పండించే వేలాది ఎకరాలను అదాని గ్రూప్‌కు మోడీ కట్టబెట్టారని, దాని వల్లే ఉల్లి ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని సిబల్ ఆరోపించారు. మరి దీనికి బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి