Pages

1, నవంబర్ 2013, శుక్రవారం

ఇక ఆర్నెళ్లకోసారి రైల్వేబాదుడు

ఇక రైల్వే ఛార్జీల మోత కూడా క్రమం తప్పకుండా మోగనుంది. ఇంధన ఛార్జీలు పెరుగుతున్నా, ఆ భారాన్ని ప్రయాణీకులపై మోపకుండా, ఇంతకాలం రైల్వేలే భరించాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో, ఇక ఆ భారం ప్రయాణీకులపైనే పడనుంది. రైల్వే బడ్జెట్‌లోనే ఈ విషయాన్ని సూత్రప్రాయంగా చెప్పిన యూపీఏ సర్కార్.. ఇప్పుడు పూర్తి స్థాయిలో తన నిర్ణయాన్ని పట్టాలెక్కించింది.  డీజిల్‌ఛార్జీలు 7.3 శాతం, విద్యుత్ ఛార్జీలు 15.5 శాతం పెరిగాయని లెక్కగట్టిన రైల్వే అధికారులు... వాటి ఆధారంగా అక్టోబర్‌లో టికెట్ ధరలను స్వల్పంగా పెంచారు.
    టికెట్‌ధరల్లో  సబ్సిడీ ఇస్తుండడం వల్ల భారతీయ రైల్వేపై ఏటా 25వేల కోట్ల సబ్సిడీ భారం పడుతోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం కూడా సర్దుబాటు చేయకపోవడం వల్ల, రైల్వేస్ నష్టాల్లో కూరుకుపోతోంది. ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే రైల్వేలు దివాళా తీయడం ఖాయం కాబట్టి.. ఛార్జీలపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను రైల్వేకే ఇచ్చేసింది యూపీఏ సర్కార్. ప్రతీ ఆరు నెలలకోసారి రైల్వే నిర్వహణకు అవుతున్న ఖర్చును లెక్కగట్టి.. దాని ఆధారంగా ఛార్జీలను పెంచబోతున్నారు. దీని ప్రకారం చూస్తే ఏప్రిల్ 2014లో మరోసారి రైల్వే ఛార్జీలు పెరగబోతున్నాయి. ఇప్పటికే పెట్రోలియం కంపెనీలకు 15 రోజులకోసారి ధరలను సవరించుకునే అవకాశాన్ని కల్పించిన కేంద్రం.. మలివిడతగా రైల్వేలకు పచ్చజెండా ఊపేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి