Pages

2, నవంబర్ 2013, శనివారం

వేగంగా వెళ్లినందుకు 78 లక్షల జరిమానా

చేతులో హైటెక్ కారుంది కదా అని రయ్యిమని దూసుకుపోయినందుకు, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఓ స్వీడిష్ కోటీశ్వరుడు. ప్రముఖ వ్యాపార వేత్త ఆండ్రెస్ విక్లోఫ్ ఈ మధ్య
ఫిన్‌ల్యాండ్ వెళ్లారు. అక్కడ 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన ప్రాంతంలో ఆయన కారు 77 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది. దీంతో వెంటాడి కారును ఆపిన అక్కడి ట్రాఫిక్ పోలీసులు, విక్లోఫ్ కళ్లుతిరిగే రేంజ్‌లో ఫైన్ వేశారు. ఫిన్‌ల్యాండ్ చట్టాల ప్రకారం డ్రైవర్ తప్పు చేస్తే, అతనికి వేసే జరిమానా, అతని సంపద ఆధారంగా ఉంటుందట. విక్లోఫ్‌కు కోట్లల్లో ఆస్తులు ఉండడంతో 78 లక్షల రూపాయల ఫైన్ వేశారు పోలీసులు. తాను తప్పు చేశానని ఆ స్వీడిష్ వ్యాపారవేత్త ఒప్పుకున్నప్పటికీ, అంత చిన్న తప్పకు ఇంత పెద్ద జరిమానా అంటూ అల్లాడిపోతున్నాడు. జరిమానాలకూ ఓ హద్దుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి