Pages
▼
26, అక్టోబర్ 2013, శనివారం
వైసీపీ సభ సూపర్ సక్సెస్
వర్షం వచ్చినా ఆగకుండా సభనిర్వహించాలని నిర్ణయించుకున్నందుకు, వైసీపీ నేతలు పండగ చేసుకుంటున్నారు. ఊహించినదానికన్నా భారీగా జనం రావడంతో ఎల్.బి. స్టేడియం నిండిపోయింది స్టాండ్స్‌తో పాటు గ్రౌండ్‌లో కూడా జనం కిక్కిరిసిపోవడంతో పోలీసులు బలవంతంగా గేట్లు మూయాల్సి వచ్చింది. ఎల్.బి.స్టేడియం చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ కూడా వైసీపీ కార్యకర్తలు, అభిమానులతో నిండిపోయింది. వర్షాల కారణంగా సరైన రవాణా సౌకర్యాలు లేకపోయినా, జనం తరలింపులో వైసీపీ నేతలు చాలా కసరత్తు చేశారు. జగన్ జైలు నుంచి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో, దీన్ని తమ బలప్రదర్శనకు వేదికగా మార్చుకున్నారు. ఇక సభలో .. కాంగ్రెస్, టీడీపీలే లక్ష్యంగా వైసీపీ నేతలు విమర్శలు చేశారు. సోనియా గాంధీ తెలుగు జాతిని రెండుగా చీల్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు కావడం వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందంటూ విమర్సించారు వైసీపీ నేతలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి