Pages

26, అక్టోబర్ 2013, శనివారం

పూణే పనైపోయింది

ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన జట్టుగా రికార్డులకెక్కిన (రూ.1702 కోట్లు) పూణే కథ అర్థాంతరంగా ముగిసిపోయింది. ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటినుంచి వివాదాల్లోనే ఉన్న పూణే వారియర్స్‌ను రద్దు చేసింది బీసీసీఐ. బకాయిలను చెల్లించకపోవడం, వచ్చే సీజన్‌కు సంబంధించి బ్యాంక్‌ గ్యారెంటీలను సమర్పించకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్‌లో టీమ్‌ను సొంతం చేసుకున్న సమయంలో బీసీసీఐ హామీ ఇచ్చినన్ని మ్యాచ్‌లు ఆడించకపోవడంతో ఫీజులు తగ్గించాలని చాలాకాలంగా పూణే టీమ్ కోరుతోంది. గత సీజన్‌కు ముందు కూడా ఈ వివాదం పతాకస్తాయిలో సాగింది. చివరకు టీమిండియా స్పానర్‌షిప్‌ను కూడా వదులుకోవడానికి సహారా సిద్దమయ్యింది. అప్పట్లో బోర్డుకు, పూణే టీమ్‌కు రాజీకుదిరడంతో చివరి ఐపీఎల్‌ను ఆడింది పూణే. ఇప్పుడు మళ్లీ వివాదం మొదటికి రావడంతో, టీమ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. దీంతో బీసీసీఐ తీవ్ర నష్టం వాటిల్లనుంది. పైగా, కొత్తగా వేలం నిర్వహించిన వాటిలో కోచి, పూణే రెండూ మధ్యలోనే రద్దు కావడం ఐపీఎల్‌పైనా మచ్చలాంటిదే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి