Pages

26, అక్టోబర్ 2013, శనివారం

ఉనికికోసం చిరంజీవి ఆరాటం

హైదరాబాద్‌ను యూటీ చేయాలంటూ అధిష్టానం చుట్టూ కాళ్లరిగేలా తిరిగి, ఆ తర్వాత సీమాంధ్ర ఉద్యోగులంతో ఢిల్లీలో కూర్చోబెట్టే సరికి తలెక్కడ పెట్టుకోవాలో తెలియక సమైక్యాంధ్ర ఉద్యమ తెరపైనుంచి మాయమైన చిరంజీవి..మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ఆరాటపడుతున్నారు. సమైక్యాంధ్ర తప్ప మరో ప్రత్యామ్నాయాన్ని ఒప్పుకునేది లేదంటూ ఢిల్లీలో మీడియా ముందు ఢంకా భజాయించారు మెగాస్టార్. తెలంగాణ తీర్మానం, బిల్లును అసెంబ్లీకి పంపించాలని డిమాండ్ చేశారు. విభజన వ్యవహారంలో కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా వెలుతుందన్న సీఎం వ్యాఖ్యలను సమర్థిస్తానన్నారాయన. అయితే, సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఒక్కరోజు కూడా బయటకు రాని చిరంజీవి, ఇప్పుడు హడావుడిగా స్టేట్‌మెంట్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి