రాష్ట్ర విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. రాష్ట్ర విభజన వ్యవహారంలో కేంద్రం సరైన మార్గసూచిని అనుసరించడం లేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హక్కులను కల్పిస్తూ రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్ 371డి పైనా వివరణ ఇవ్వాలంటూ ఆయన ధర్మాసనాన్ని కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి