Pages

21, అక్టోబర్ 2013, సోమవారం

మహేశ్‌నే నమ్ముకున్న యూటీవీ


అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ డిస్నీ - యూటీవీ మోషన్ పిక్చర్స్‌ టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేశ్ బాబును నమ్ముకుని తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్, హాలీవుడ్లో అద్భుతమైన సినిమాలను నిర్మించిన యూటీవీ, ఇప్పటికే తమిళ, మలయాళ చిత్రాలను నిర్మిస్తున్నాయి. అయితే తెలుగులో మాత్రం తొలి సినిమాను మహేశ్‌ బాబుతోనే మొదలుపెట్టనుంది. దీనికోసం మహేశ్‌కు, యూటీవీకి మధ్య ఒప్పందం కుదిరింది.  ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ 1లో నటిస్తున్నాడు. 'ఆగడు' కూడా మరికొన్ని రోజుల్లోనే సెట్స్‌పైకి వెళుతోంది. ఇది పూర్తికాగానే వచ్చే ఏడాది జులైలో యూటీవీ సినిమా మొదలవుతుంది. యూటీవీతో పాటు మహేశ్ కుటుంబ బ్యానర్ ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తాయి. అత్యంత భారీ బడ్జెట్‌ను దీనికోసం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మిర్చితో ఆకట్టుకున్న కొరటాల శివ ఈ సినిమాకు డైరెక్టర్. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాన్ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఫ్యామిలీ,యాక్షన్ డ్రామాను అద్భుతంగా తెరకెక్కించగలిగే కొరటాల శివ, మహేశ్‌కు సూపర్ హిట్ ఇస్తాడని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి