Pages

18, అక్టోబర్ 2013, శుక్రవారం

దూసుకెళ్తాతో దశ తిరిగినట్లేనా!

దూసుకెళ్తా సినిమాకు హిట్ రావడంతో ఖుషీఖుషీగా ఉన్నాడు హీరో మంచు విష్ణు. పదేళ్ల కెరీర్‌ను ఇటీవలే పూర్తి చేసుకున్న తనకు, సినీ ప్రేక్షకులు బ్రహ్మాడమైన గిఫ్ట్‌ను ఇచ్చారని ఫీలవుతున్నాడు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ కలగలిపి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దూసుకెళ్తాకు క్రెడిట్ దక్కడంతో, కెరీర్‌లో మూడో హిట్‌ను దక్కించుకున్నాడు విష్ణు. ఢీ, దేనికైనా రెఢీ, దూసుకెళ్తా.. ఈ మూడు సినిమాలే ఇప్పటివరకూ విష్ణు ఖాతాలో ఉన్న హిట్లు. వరసగా రెండు హిట్లు రావడంతో ఇక తన దశ తిరిగిందని ఫీలవుతున్న మంచువారబ్బాయి.. మరో సినిమాను వీలైనంత త్వరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. అన్నట్లు ఈ కొత్త సినిమాలో హీరోయిన్ హన్సిక కావడం మరో విశేషం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి